అహల్య తనయులు వాలి సుగ్రీవులు. (Vali, Sugreevulu)
అహల్య తనయులు వాలి సుగ్రీవులు.
(Vali, Sugreevulu)
అహల్య శాపవృత్తాంతము మనకు తెలుసు. అహల్యకు ఇంద్రుని వలన కలిగిన సంతానమే వాలిసుగ్రీవులు. ఒకసారి గౌతముడికి వాళ్ళు తన సంతానమా కాదా అనే సందేహము వచ్చి, ‘నా సంతానం కాని పక్షంలో వానరులుగా మారిపొండి!’ అని శపిస్తాడు. దానితో వాలి, సుగ్రీవులు వానరులైపోతారు. వారిని గౌతముడు వదిలివేయడంతో వానర రూపులై సంచరిస్తుంటారు. ఆదిమ వానరుడైన ఋక్షవిరజుడు వీరిద్దరినీ చేరదీసి పెంచుతాడు. పెద్దవాడైన వాలిని కిష్కింధకు రాజును చేసింది ఋక్షవిరజుడే. చివరికి రాముని బాణానికి వాలి చనిపోతాడు. సుగ్రీవుడు రాముని మిత్రుడై, కిష్కింధకు రాజై చిరకాలం జీవిస్తాడు. వాలి మహాబలవంతుడు. రావణాసురుని సైతం యుద్ధంలో జయిస్తాడు