తిరుమల విమాన గోపురం ఏడుసార్లు బంగారు తాపడం (Tirumala Vimana Gopuram)

 

తిరుమల విమాన గోపురం ఏడుసార్లు బంగారు తాపడం

(Tirumala Vimana Gopuram)

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయ గోపురం ఇతర ఏ దేవాలయాలకూ సాటిరాని విధంగా బంగారంతో మెరిసిపోతూ ఉంటుంది. మహోజ్జ్వలంగా, దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. శ్రీవారి ఆలయంలో ఈ భాగాన్ని ఆనంద నిలయం అని, విమాన గోపురం అని అంటారు.

 

ఆనంద నిలయం లేదా విమాన గోపురానికి బంగారంతో తాపడం చేయించాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో అనే సందేహం కలగడం సహజం. విజయనగర రాజైన నరసింహ దేవరాయలు మొదటిసారి విమాన గోపురానికి బంగారు రేకులు తోడిగించాడు. తర్వాత సాళువ మాంగిదేవ మహారాజు, మూడోసారి మల్లన మంత్రి, నాలుగోసారి శ్రీకృష్ణ దేవరాయలు ఆనంద నిలయానికి బంగారు పూత పూయిస్తూ వచ్చారు. ఆ తర్వాత అయిదోసారి కంచి తాతాచార్య, ఆరోసారి హాథీరాంజీ మహంతు ప్రయాగదాసు విమాన గోపురానికి బంగారు పూత పూయించారు. 1958లో ఏడోసారి అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అధికారి పన్నెండు వేల తులాల బంగారంతో విమాన గోపురానికి బంగారు పూత పూయించారు.


Tirumala Temple Vimanam, The sanctum sanctorum and its tower, Temple Gopuram Vimanam, sanctum sanctorum and Vimanam