జయ-విజయులు ఎవరు?
జయ-విజయులు ఎవరు?
జయ-విజయులు, శ్రీ మహావిష్ణువు వైకుంఠధామంలో మందిరానికి కావలివారు. ఒకనాడు బ్రహ్మమానసపుత్రులు ఐదేండ్ల బాలికలైన సనక, సునంద, సనత్క్ మార, సనత్సుజాతులు శ్రీహరిని దర్శించడానికి వైకుంఠం వచ్చారు. ద్వారపాలకులైన జయవిజయలు వారిని లోపలి పంపడానికి నిరాకరించారు. బ్రహ్మజ్ఞానులైన తమను లోనికి వెళ్ళడానికి అడ్డగించడం సరికాదని చెప్పారు. అయినా జయవిజయులు వినలేదు. మునులు వారిని భూలోకంలో రాక్షసులై జన్మించమని శపించారు. విషయం తెలుసుకున్న శ్రీహరి సనకాదులను సాదరంగా లోనికి తీసుకువెళ్ళారు. తరువాత ద్వారపాలకులైన జయవిజయులు మహావిష్ణువుకు నమస్కరించి నిలబడ్డారు.
అప్పుడు మహా విష్ణువు వారిరువుర్నీ పలుమార్లు విష్ణుభక్తులుగా జనియించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక మూడు సార్లు మహావిష్ణువు ఆగర్భ శత్రువులుగా, ఆయనకు సమానంగా శక్తివంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు. అందుకు వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకుంటారు. దాని ప్రకారమే వారు వారే మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రెండో జన్మలో రావణ, కుంభకర్ణులు, మూడో జన్మలో శిశుపాల, దంతవక్త్రలుగా జన్మించారు. కలియుగంలో వారికి శాపవిమోచనం కలిగింది. కాబట్టి చాలా విష్ణు దేవాలయాల్లో జయ విజయులు ద్వారపాలకులు గా చెక్కి ఉండటాన్ని గమనించవచ్చు.