Devadasu Dorikipoyaadu

 

Devadasu Dorikipoyaadu

దేవదాసు దొరికిపోయాడు

ఒక రోజు దేవదాసు బాగా తాగేసి ఇంటికి వచ్చాడు.

అర్థరాత్రి కావడంతో భార్యకు అనుమానం రాకుండా, వాసన తెలియకుండా హాల్లో ఉన్న

డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి నోటికి ప్లాస్టర్ అతికించుకుని వెళ్లి పడుకున్నాడు.

తెల్లారింది.

నిద్రలేవగానే దేవదాసు దగ్గరికి వచ్చిన భార్య " మీరు రాత్రి బాగా తాగేసి వచ్చారా ? " అని

కొంచం కోపంగా అడిగింది.

" అబ్బే...నేనసలు త్రాగలేదు " అని వినయంగా అన్నాడు దేవదాసు.

" మరి ఈ ప్లాస్టర్ అద్దానికి ఎవరు అతికించారు " అని మరింత కోపంగా అడిగింది అద్దానికి

అతికించి ఉన్న ప్లాస్టర్ ను చూపిస్తూ.

" ఇదేమిటి ? ఇలా దొరికిపోయాను " అని మనసులో అనుకుంటూ ఇంట్లో నుండి

బయటికి వెళ్ళిపోయాడు దేవదాసు.

అతని భార్య అరుస్తూనే ఉంది.

ఆ మాటలు విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పకపక నవ్వుకుంటున్నారు.