పరిస్థితిని బట్టి స్నేహం
పరిస్థితిని బట్టి స్నేహం
అడవి గాల్చు వేళ నగ్నికి సాయమై
నట్టి గాలి దీపమార్పి వేయు
బీదపడిన వేళలేదురా స్నేహంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!!
జంధ్యాల పాపయ్యశాస్త్రి కలం నుంచి జాలువారిన తెలుగుబాల శతకంలోని పద్యమిది. పిల్లలకు అవసరమైన నీతిసారమంతా ఇందులో కనిపిస్తుంది. దానికి పై పద్యమే ఒక మంచి ఉదాహరణ. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కొందరు స్నేహితులు మన వెనకే ఉంటూ ప్రోత్సహిస్తూ కనిపిస్తారు... అగ్ని మంచి ఊపు మీద ఉండి అడవిని తగలబెట్టే సమయంలో గాలి కూడా దానికి తోడవుతుంది కదా! కానీ ఎప్పుడైతే నిజంగా స్నేహితుని అవసరం ఉంటుందో అప్పుడు ఆప్తులు కనిపించరు సరికదా... వారి ప్రవర్తన మన పరిస్థితిని మరింత దిగజారేట్లుగా ఉంటుంది. అడవిని కాల్చే సమయంలో అగ్నికి తోడుగా ఉన్న అదే గాలి, మిణుకుమిణుకుమంటున్న దీపాన్ని ఆర్పేందుకు త్వరపడినట్లన్న మాట!
..Nirjara