జపం ఎందుకు ఎలా చేయాలో తెలుసా??
జపం ఎందుకు ఎలా చేయాలో తెలుసా??
ఒకప్పుడు మనిషి జీవితాన్ని ఎంతో ఉన్నతంగా, క్రమశిక్షణగా ఉంచిన వాటిలో ధ్యానం చేయడం, జపం చేయడం ప్రముఖ పాత్ర వహించాయి. ప్రస్తుత కాలంలో ఉన్న వేగవంతమైన జీవితంలో ఈ జపాన్ని, ధ్యానాన్ని చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారని చెప్పాలి. అయిదు నిమిషాలు పాటు కుదురుగా ఉండలేని వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇలా కుదురుగా ఉండలేకవడమనే సమస్య వల్ల జీవితంలో నిర్వహించాల్సిన ఎన్నో పనులలో కూడా విఫలం అవుతూ ఉంటారు. వీటికి పరిష్కారంగా అందరికీ అందుబాటులో ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చేసుకోదగినది జపం.
ఈ తరానికి ఈ మాట ఆశ్చర్యంగా అనిపించినా ఇదే గొప్ప పరిష్కారం. జపం అంతే ఒక దేవతా మంత్రాన్ని పదే పదే ఉచ్చరిస్తూ ఆ మంత్రంలోని వైబ్రేషన్ ను సొంతం చేసుకోవడం. నిజానికి ఇది కాస్త ఓపికతో కూడుకున్నది అయినా దాన్ని సాధించిన తరువాత పలితం మాత్రం చెప్పలేనంత గొప్పగా ఉంటుంది.
జపం కూడా చేసే విధానాన్ని బట్టి దాని పలితాన్ని ఇస్తుంది. అందరికీ అనుకూలమైన ప్రాంతం ఇల్లు. ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుంది. ఇక భారతీయ సాంప్రదాయంలో నదులు ఒక భాగం. వీటిని ఎంతో పవిత్రంగా చూస్తారు భారతీయులు. అలాంటి నదిలో చెసే జపం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. దేవతా స్వరూపంగా చూసే జంతువులలో ఆవు ఎంతో గొప్పది. అలాంటి ఆవుల నిలయమైన గోశాలలో జపం వందరెట్లు పలితాన్ని ఇస్తుంది. యాగశాలలో చేసే జపం అంతకుమించి ఫలితాన్నిస్తుంది . ఇక దేవుళ్ళు స్వయంభువు గానూ, ప్రతిష్టగానూ కొలువై ఉన్న పుణ్యతీర్ధాలలోను, దేవతాసన్నిధి లోనూ చేస్తే పదివేలకోట్ల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అన్నిటికీ మించి ఆ పరమేశ్వరుడి సాన్నిద్యంలో అంటే శివాలయంలో జపం చెస్తే అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది.
అలాగే జపాన్ని కూడా వివిధ రకాలుగా అంటే వివిధ అసనాలలో చేయడం వల్ల కూడా ఫలితాలు వేరుగా ఉంటాయి.
వెదురు తడకపై కూర్చుని చేస్తే దారిద్ర్యము సంభవిష్తుంది కాబట్టి ఎప్పుడూ ఇలా చేయకూడదు.
రాతిపై కూర్చుని చేస్తే రోగాలు వస్తాయని అంటారు. అందుకే రాతిమీద కూర్చుని చేయకూడదు.
నేలపై కూర్చుని చేస్తే ధుఖము కలుగుతుంది. మనిషి జీవితానికి ప్రశాంతత పోగొట్టేది దుఃఖమే. ఆందుకే దీనికి దూరంగా ఉండాలి.
కొయ్యపీటపై కూర్చుని జపం చేస్తే దౌర్భాగ్యము కలుగుతుంది.
గడ్డితో చేసిన చాపపై కుర్చీని జపం చేస్తే చిత్తచాపల్యము కలుగుతాయి. అంటే మనసు నిలకడగా ఉండదు.
జింక చర్మము పై కూర్చుని చేస్తే జ్ఞానసిద్ధి కలుగుతుంది. చాలామంది యోగులు, సన్యాసులు దీనిపైనే జపం చేస్తారు.
వ్యాఘ్ర చర్మం(పులి తోలు)పై కూర్చుని జపం చేస్తే మోక్షము సిద్ధిస్తుంది. ఎంతో గొప్ప మహర్షులు పులిచర్మం పై జపం చేస్తారు.
వస్త్రాన్నీ పరచుకుని దానిమీద కూర్చుని జపం చేస్తే డబ్బు సమకూరి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి
పేముతో అల్లిన ఆసనం మీద కూర్చుని జపం చేస్తే ఎంతో రోగాలతో సతమతం అవుతున్న వారికి ఆ రోగాలు నివారణ అవుతాయి.
ధుఖాలు పొగొట్టుకొవడానికి -కంబళి పైన కూర్చుని జపం చేసుకొవాలి. అలాగే ధర్భలతో చేసిన ఆసనంపై కూర్చుని జపము చేసినా పుష్టిని కలుగిస్తుంది.
ఒకప్పటి కాలంలో వందేళ్లు చేసిన జపానికి కలిగే పలితం ఇప్పటి కాలంలో ఒక గంట కూర్చుని జపం చేస్తే దాని పలితం ప్రస్తుత మనిషి జీవితాన్ని ఎంతో గొప్ప మార్పులోకి తీసుకెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జపం చేయడం అలవాటు చేసుకుంటే జీవితం సమస్యల నుండి బయటపడుతుంది.
◆ వెంకటేష్ పువ్వాడ