శ్రీ సుబ్రహ్మణ్యా ష్టో త్తర శతనామ స్తోత్రమ్ (Sri Subrahmanya Ashtottara Satanama Stotram)
శ్రీ సుబ్రహ్మణ్యా ష్టో త్తర శతనామ స్తోత్రమ్
(Sri Subrahmanya Ashtottara Satanama Stotram)
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహన షడాననం
దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటద్వజమ్
ఓం స్కంధో గుహ శ్శణ్ముఖశ్చ ఫాలనేత్ర సుతః ప్రభు:
పింగళ: కృత్తికాసూను: శ్శిఖివాహో ద్విజడ్చుజ:
ద్విషణ్ణేత్ర శక్తిధరః పిశితాష ప్రభంజనః
తారకాసుర సంహారీ రక్షోబల విమర్దన
మత్తః ప్రమత్తోన్మత్తశ్చ సురసైన్య సురక్షకః
దేవసేనాపతి: ప్రాజ్ఞః కృపాళు ర్భక్తవత్సలః
ఉమాసుత శక్తిధర: కుమారః క్రౌంచధారణ
సేనానీ రగ్నిజాన్మా చ విశాఖ: శ్శంకరాత్మజః
శివస్వామీ గానస్వామీ సర్వస్వామీ సనాతనః
అనంతశక్తి రక్షోభ్యః పార్వతీ ప్రియనందనః
గంగాసుతః శరోద్భూత్త: పావకాత్మజ ఆత్మభువః
జ్రుంభ: ప్రజ్జ్రుంభః కమలాసన సంస్తుతః
ఏకవర్ణో ద్విర్ణ శ్చత్రివర్ణ తధైవచ
చతుర్వర్ణ: పంచవర్ణ పరంజ్యోతి: ప్రజాపతి
అగ్నిగర్భః శమీగర్భో విశ్వరేతాః సురారి:
హిరణ్యవర్ణః సుభకృరిత్ వశుమాన్ వటువేషభ్రుత్
పూషా గభస్తిర్గహనః చంద్రవర్ణః కళాధరః
మాయాధరో మహామాయీ కైవల్యః సకలాత్మకః
విశ్వయోనీ రమేయాత్మా తేజోనిధిరనామయః
పరమేష్టీ పరబ్రహ్మా వేదగర్బో విరాట్వపు:
పుళిందకన్యా భర్తాచ మహాసారస్వతప్రదః
అశ్రితాఖిల దాతా ఛ చొరఘ్నే రోగనాశనః
అనంతమూర్తి రానందః శిఖండీకృత కేతనః
డంభః పరమ డంభశ్చ మహాడంబో వృషాకపి:
కరనోపాత్త దేహశ్చ కారణాతీత విగ్రహః
ఆహిరూపోట మృతవపు: ప్రాణాయామ పరాయణః
విరుద్దహంతా వీరఘ్నో రక్తాస్యామ: సుడింగళః
సుబ్రహ్మణ్యో గుహః ప్రీతో బ్రహ్మణ్యో బ్రహ్మణ్యో బ్రహ్మణ ప్రియః
శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం