శ్రీ సాయి ఎలాంటి వారు
శ్రీ సాయి ఎలాంటి వారు?
శ్రీ సాయి ఎలాంటి వారో తెలుసుకోవాలని సాయిబాబా భక్తులకే కాదు మనసారా దేవుళ్ళను నమ్ముతూ ఆత్మసాక్షిగా నిత్యం పూజించే భక్తులకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది. మరి తెలుసుకోవాలని మనస్సులో ఉన్నప్పుడు తెలుసుకోకుండా భక్తులు ఉండలేరు. మరి ఆలస్యం చేయకుండా శ్రీ సాయి ఎలాంటి వారో మనం ఇప్పుడు మన తెలుగువన్.కామ్/భక్తి లో తెలుసుకుందాం!
శ్రీ సాయిబాబా జ్ఞానమూర్తి. వైష్ణవులకు విటలుడు. శివ భక్తులకు సాక్షాత్తూ పరమేశ్వరుడు. క్లిష్టతరమైన సంసారాన్ని బాబా జయించాడు. బాబాకు శాంతమే భూషణం . మౌనమే అలంకారం. బాబా సారంలో సారాంశం వంటివారు. నశించిపోయే బాహ్యాంశాలపై అభిమానం లేనివారు.
బాబా నిత్యం అత్మసాక్షాత్కారంలోనే మునిగి ఉండేవారు. బాబాకు భువి, దివిపై ఉన్న వస్తువులపై ఎలాంటి అభిమానం లేదు. బాబా అంతరంగం అద్దం వలె స్వచ్చమైనది. బాబా పలుకులు అమృత బిందువులు. బాబాకు బీద, ధనిక తారతమ్యాలు లేవు.బాబాకు అందరూ సమానులే. బాబా మానావమానాలను లెక్కచేసేవారు కాదు. బాబా అందరికీ ప్రభువు, యజమాని. బాబా అందరితో కలసిమెలసి ఉండేవారు. ఆడేవారు.పాడేవారు.
బాబా పెదవులపై 'అల్లామాలిక్' అనేది నిత్య భగవన్నామస్మరణ. ప్రపంచమంతా మేల్కొని ఉంటే తాను యోగనిద్రలో ఉండేవారు. జగద్రక్షకుడు కదా! బాబా అంతరంగం సముద్రమంత లోతు, ప్రశాంతం, గంభీరం. బాబా దర్బారు ఘనమైనది. వందలకొద్దీ ఉపదేశాలకు అది వేదిక. బాబా ది సచ్చిదానంద స్వరూపం. నిరుత్సాహం కానీ, ఉల్లాసం కానీ ఎరుగరు.
తెలిసింది కదా మనకు శ్రీ సాయి ఎలాంటి వారో ! మరిన్ని సాయిబాబా మహిమల గురించి, వారి శక్తుల గురించి, వారి విశిష్టత గురించి నిరంతరం తెలుగువన్.కామ్/భక్తి లో తెలుసుకుంటూ ఉందాం !