శ్రావణమాసం ప్రారంభం

 

శ్రావణమాసం ప్రారంభం

 

 

   శ్రావణమాసం ఆధ్యాత్మికంగా లక్ష్మీప్రదమైన మాసం. ఈ మాసం లక్ష్మీదేవిని ఆరాధించేవారి సకల సంపదలు చేకూరుతాయి. ఇంకా వరలక్ష్మీవ్రతం ఆచరించే వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శుభ ఫలితాలను ఆ లక్ష్మీమాత అనుగ్రహిస్తుంది. సోమ, శుక్రవారం.. లక్ష్మేదేవికి ఇష్టమైన రోజులు. ఆ రోజుల్లో పొద్దున, సాయంత్రం దీపారాధన చేయడం దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే శ్రావణ అష్టమి, నవమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ వంటి తిథులు లక్ష్మీపూజకు శ్రేష్టమైనవని భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ‘శ్రావణ మాసం’ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇళ్లు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కళ కళలాడుతూ ఉంటాయి.