సోమ ప్రదోష వ్రతం.. ఈరోజును అస్సలు మిస్ కాకండి..!

 

సోమ ప్రదోష వ్రతం..  ఈరోజును అస్సలు మిస్ కాకండి..!


కార్తీక మాసం ఎంతో పుణ్యప్రదమైన మాసం అని అందరికీ తెలిసిందే.. కార్తీక మాసంలో సోమవారాలకు ఎనలేని  ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా ప్రతి మాసంలో ప్రదోష వ్రతం వస్తుంది.  ఈ ప్రదోష వ్రతం ఏ రోజు వస్తుందో ఆ రోజుకు సంబంధించిన ప్రదోష వ్రతంగా చెబుతారు.  నవంబర్ నెలలో ఈ ప్రదోష వ్రతం సోమవారం వచ్చింది.  ఈ రోజును సోమ ప్రదోష వ్రతం అని అంటారు.  సోమ ప్రదోష వ్రతం రోజు  ఉపవాసం ఉండటం,  శివుడిని వివిధ రకాలుగా పూజించడం ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతారు.  

కార్తీక ప్రదోష వ్రతం..

ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే.. కార్తీక మాసంలో ఇది సోమవారం రోజున కలిసి రావడంతో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.  సోమ ప్రదోష వ్రతం రోజు సాయంత్రం ప్రదోష సమయంలో శివుడిని ఆరాధించడం ఎంతో పుణ్యప్రదం.

వివాహం కోసం..

ప్రదోష వ్రతం రోజు శివుడికి రాగి పాత్రలో గంగా జలాన్ని సమర్పించాలి. అలాగే శివుడికి బెల్లం,  పసెరపప్పు ను సమర్పించాలి.  శివుడికి గన్నేరు పువ్వులను సమర్పించడం,  తేనెను నైవేద్యంగా ఉంచడం  చేస్తే వివాహంలో అడ్డంకులు ఎదురవుతున్న వారికి చాలా మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతారు.

మనఃశాంతికి..

ప్రదోష వ్రతం రోజున శివుడికి బిల్వపత్రి ఆకులను సమర్పించడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. 11బిల్వ పత్రి ఆకులను సమర్పించడం మంచిది. అలాగే శమీ వృక్షపు ఆకులను కూడా సమర్పించవచ్చు.  శమీ ఆకులతో శివలింగ అర్చన చేస్తే తలపెట్టిన పనులలో విజయం, మానసిక శాంతి లభిస్తాయని చెబుతారు.

ఇతరులు ఇబ్బంది పెడుతుంటే..

ప్రదోష ప్రతం రోజున శివుడికి పచ్చి బియ్యాన్ని నైవేద్యంగా ఉంచడం  మంచిదట. పరమేశ్వరుడి ముందు మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల మృత్యు భయం, శత్రు బాధ తొలగిపోతుందని, ఇతరులు ఇబ్బంది పెడుతుంటే అలాంటి వారి నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు.

ప్రదోష వ్రతం రోజు శివలింగాన్ని గోధుమలు,  ధాతువుతో అభిషేకం చేయించుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.  ఇలా చేస్తే  శివుని ఆశీస్సులు లభిస్తాయట.


ప్రదోష వ్రతం రోజు  తెల్లటి వస్తువులను దానం చేయడం వల్ల సంబంధాల మధ్య ఇబ్బందులు  ఎదుర్కునే వారికి పరిష్కారం లభిస్తుందని చెబుతారు.   ఇది బంధాల మధ్య ఉండే అపార్థాలను,  ఇబ్బందులను  తొలగిస్తుందని, బంధాలు తిరిగి ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుందని చెబుతారు.

                                   *రూపశ్రీ.