దృశ్య పదార్థాలన్నీ శివ స్వరూపాలే

 

దృశ్య పదార్థాలన్నీ శివ స్వరూపాలేనని" శివపురాణంలో శంకర భగవానుడు విష్ణుదేవునితో అన్నారు. "నిర్గుణుడనైన నేను సృష్టి స్థితి లయక సత్వ, గుణాలతో బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలను ధరిస్తుంటాను.

మట్టిచే తయారు చేయబడిన పాత్రలలో నామ రూప భేదమే కాని వాస్తవ భేద మెంత మాత్రము లేదు. ఉన్నది ఒకే మట్టి. అలాగే నురగలు, కెరటాలు, బుడగలు మొదలైన బుడగలన్నీ సముద్ర లక్షణాలు.. కానీ ఆ సముద్రం మాత్రం ఏకైకమైనదే..

ఇదే తరహాలో "వాస్తవానికి దృశ్య పదార్థాలన్నీ శివ స్వరూపాలే". నేను, నీవు, ఈ బ్రహ్మ.. భవిష్యత్తులో ఆవిర్భవించనున్న నా రుద్రమూర్తీ ఇవన్నీ ఏకస్వరూపాలే. వీటిలో ఏ బేధం లేదని" విష్ణువుతో పరమేశ్వరుడు తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. 

పూర్వం బ్రహ్మ, విష్ణు మూర్తుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు.. ముగ్గురిలో ఎవరు గొప్పవారో? తేల్చుకోవాలనే స్థితికి పోటీపడసాగారు. వారిని గమనిస్తున్న పరమశివుడు వారిలో పుట్టిన అహంభావాన్ని అణగదొక్కి వారి ఇద్దరికీ చక్కని గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో పై విధంగా హితబోధ చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.

వీరి అహంను తొలగించే దిశగా మాఘమాసం చతుర్దశి నాడు వారి ఇరువురులకు మధ్యంగా జ్యోతిర్లంగంగా రూపుదాల్చారు. దీంతో జ్యోతిర్లింగ ఆది, అంతాలను తెలుసుకోవాలని విష్ణుమూర్తి వరాహరూపం దాల్చి జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్లగా, బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి ఆకాశం అంతా ఎగిరాడు. చివరకు కనుక్కోలేక ఓడిపోయి, పరమేశ్వరుని శరణువేడుకుంటారు. అప్పుడు ఆ పరమ శివుడు అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు పండితులు చెబుతున్నారు.

దీంతో బ్రహ్మ, విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి, పరమాత్మను విశేష పూజలతో సేవించి కీర్తించినారు. ఆ పర్వదినమే "మహాశివరాత్రి" అయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత సత్య, జ్ఞాన, అనంత స్వరూప గుణాతీతుడైన పరబ్రహ్మ.. శంకరదేవుణ్ణి మహాశిరాత్రి నాడు పూజిస్తే మోక్షమార్గం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు. కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన మహేశ్వరుడిని ప్రార్థించి.. ఆయన అనుగ్రహం పొందండి.