వందే శివం శంకరం

వందే శివం శంకరం

వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం !!

వందే సర్వజగ ద్విహార మతులం వందే కరిత్వగ్ధరం
వందే దేవ శిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభం
వందే పర్వత కన్యకార్థ వపుషం వందే పరం చిన్మయం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం !!

వందే వ్యోమ సభాపతిం నటపతిం వందేర్కదంతాపహం
వందే నిర్మల మాదిభూత మనిశం వందే మఖధ్వంసినిం
వందే నిత్య మృగేంద్రజా ప్రియకరం వందేతి శాంతాకృతిం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం !!

వందే భూరథ మంబుజాక్ష విశిఖం వందే త్రయీవాజినం
వందే శైల శరాసనం ఫణిగుణం వందేబ్ది తూణీరకం
వందే పద్మజ సారథిం పురహరం వందే మహాభైరవం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం !!

వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లాలాటేక్షణం
వందే వ్యోమకచం జటాసుమకుటం వందేబ్జ గంగాధరం
వందే మారహరం త్రిపుండ నిటలం వందేష్ట మూర్త్యాత్మకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం !!

వందే రాజిత పర్వతాగ్ర నిలయం వందే సురాధీశ్వరం
వందే నిర్గుణ ముప్రమేయ మమలం వందే యమద్వేషిణం
వందే కుండలిరాజ కుండలధరం వందే సహస్రాననం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం !!

వందేనంత రవిప్రకాశ మగుణం వందేన్దకస్యాంతకం
వందే పద్మజ విష్ణుగర్భ కులిశం వందే దయాంభోనిధిం
వందే చిత్సభమీశ్వరం సురనుతం వందే త్రిమూర్త్యాత్మకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం !!

వందే పస్మృతి శిక్షకం విషహరం వందే మృడం ధూర్జటిం
వందే విప్రవరై స్సుపూజిత పదం వందే భవోత్తారకం
వందే ధర్మముఖార్థదం శ్రుతినుతం వందే గురూణాం గురుం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం !!

శార్దూలంఘ్రి మహర్షిణా విరచితం సంకీర్తయే ద్వంద్వన
స్తోత్రం తద్గతనామ భిర్యజతి యశ్శంభుః సభాయాః పతిం
సంధ్యా సుపత్రివాసరం సునియతో ధర్మాది సత్యం పదం
లబ్ద్వౌ  హేందు కలాధరస్య సచివో భూత్వా న చ క్రీడతిః !!

సృష్టి - స్థితి - లయకారులు త్రిమూర్తులు. అందు లయకారుడు శంకరుడు. "శంకరో తీతి శంకరః" సుఖము నిచ్చువాడు లేదా కల్గించువాడని అర్థం. అట్టి శంకరునికి వందనం చేయుచూ - ఈ స్తోత్రాన్ని పఠించినచో భక్తవశంకరుడై, శంకరుడు భక్తుని సంతస తరంగాల తేలించి, లాలించును ! కాన - శివభక్తులై సుఖించి, శివ సాయుజ్యము నందుటకై ఈ స్తోత్ర పారాయణ చేయవలెను.