సాయిబాబా తొమ్మిది గురువారముల వ్రతమహత్యం

 

సాయిబాబా తొమ్మిది గురువారముల వ్రతమహత్యం

 

 

నవ గురువార సాయిబాబా వ్రత ఆచరణ నియమాలు

1     ఏ భక్తుడైనా స్త్రీ పురుష భేదము లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును.
2     ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును.
3    ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోనూ ఆచరించినచో మహత్వపూరితమైన ఫలము ప్రాప్తించును.
4     ప్రార్థనలు ఫలించాలంటే, కోర్కెలు తీరాలంటే భక్తీపూరితముగా సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి.
5     ఉదయం సమయమైనను, సాయంత్ర సమయమైనను ఈ పూజలు ఆచరించవచ్చును. ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పటమును గాని విగ్రహనును గాని ప్రతిష్టించి సాయినాథుని నుదిటిపై చందనం మరియు తిలకం దిద్దాలి. పూలమాలను గాని పసుపు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభంలో సాయిజ్యోతిని వెలిగించి సాంబ్రాణి, అగరు దూపములను సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలో వున్న చక్కర గాని, మిఠాయిగాని, ఫలములు గాని నైవేద్యముగా సపర్పించాలి. వ్రతములో కూర్చున్నవారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి.
6     పాలుగాని, కాఫీగాని, టీగాని లేక మిఠాయిలనుగాని, ఫలములనుగాని ఆహారముగా సేవించో లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూత (మధ్యాహ్నం/రాత్రి) ఆహారం సేవించిగానీ వ్రతమును ఆచరించాలి. ఆకలి కడుపుతోను లేదా పూర్తీ ఉపవాసంతోనూ ఈ వ్రతమును ఆచరించరాదు.
7     వీలైనచో 9 గురువారములు సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహం లోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి.
8     భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయంలో కూడా ఈ వ్రతమును కొనసాగించవచ్చును.
9     ఈ 9 గురువారములు స్త్రీలు మైల పడితే లేక మరో కారణం చేత గాని పూజలను ఆచరించనిచో ఆ గురువారం వదిలివేయవచ్చును. ఈ వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు. మరియు రాబోవు గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారములు పూర్తిచేయాలి.

సాయిబాబా వ్రత గాథ

 

 

కోకిల అను సాధువైన స్త్రీ తన భర్త మహేష్ తో ఒక నగరంలో నివసిస్తోంది. పరస్పర ప్రేమానురాగాలతో, అన్యోన్యంగా వారు సంసారం సాగిస్తున్నారు. కాని మహేష్ ది దేబ్బలాడు స్వభావం మరియు అతనిమాటలతో, భాషలలో సభ్యత అను హద్దులే ఉండేవి కావు. ఇరుగుపొరుగు వాళ్ళకు మహేష్ స్వభావం చాలా ఇబ్బందికరంగా ఉండేది. కాని కోకిల చాలా శాంతస్వభావురాలైన భక్తురాలు. అపారమైన విశ్వాసంతో ఆమె సహనంతో అన్ని కష్టాలు సహిస్తూ వస్తుండేది. కాలక్రమంగా ఆమె భర్త యొక్క వ్యాపారము దెబ్బతినగా సంసారం సాగడమే కష్టంగా ఉండేది. కాని మహేష్ పొద్దస్తమానం భార్యతో చీటికీమాటికీ పోరాడుతూ, ఇబ్బందులకు గురిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఒక సాధువు వారి గృహముముందు నిలిచినాడు. ఆ సాధువు కోకిల వదనం చూసి బియ్యం మరియు పప్పు భిక్షం అడుగుతూ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక అని కోకిలను దీవించాను. కోకిల చాలా బాధపడుతూ ఈ జీవితంలో తనకు సంతోషమనేది రాయబడిలేదంటూ తన విషాదగాధను చెప్పుకుంది.

 

 

ఆ సాధువు ఆమెను సాయిబాబా వ్రతమును 9 గురువారములు ఆచరించమని ఉపదేశించాడు. వ్రతము సమయమునందు పళ్ళు పానీయములు లేక ఒక పూత ఆహారము మాత్రమే భుజించాలని ఆదేశించాడు. సాధ్యమైతే సాయిబాబా మందిరానికి వెళ్ళి ప్రార్థించాలని లేదా గృహంలో సాయి పూజను ఆచరించి 9 గురువారములు తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నిర్ధేశించబడిన నియమాలను అనుసరించి బీదలకు అన్నదానం గావించి 5 మందికి లేక 11మందికి శ్రీసాయి వ్రత పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని, ఈ వ్రత ఆచరణ చాలా మహాత్వపూరితమైనది, మరియు కలియుగానికి చాలా యుక్తమైనది. ఈ వ్రతము భక్తుని కోర్కెలను తీర్చును. కాని భక్తునికి సాయినాథునిపై ప్రగాఢ విశ్వాసము మరియు భక్తీ కలిగి ఉండాలి. ఏ భక్తుడైతే ఈ వ్రతమును నియమానుసారంగా భక్తిశ్రద్ధలతో ఆచరించునో అతని సమస్త కోరికలు, ప్రార్థనలు సాఫల్యం గావించును అని సాధువు కోకిలకు చెప్పెను.

 

 

కోకిల కూడా ఈ నవ గురువార వ్రతమును ఆచరించాలన్న నిర్ణయానికి వచ్చి నిర్ధేశించబడిన సమయానుసారంగా బీద సాదలకు అన్నదానం గావించి, సాయివ్రత పుస్తకములను తొమ్మిదవ గురువారం ఉచితంగా ఇచ్చింది. అలా కొన్ని రోజులు గడిచిన పిమ్మట ఆమె కష్టాలన్నీ మాయమైనవి. గృహంలో సుఖశాంతులు వెల్లివిరిసాయి. మహేష్ యొక్క కలహా స్వభావం శాశ్వతంగా అంతరించింది. అతని వ్యాపారం సజావుగా కొనసాగింది. వారి జీవనం వృద్ధి చెందినది. ఆ తరువాత కొద్ది రోజుల పిమ్మట ఒక దినం సూరత్ నుండి కోకిల యొక్క బావ భార్యతో కోకిల ఇంటికి విచ్చేశారు. వారు తమ పిల్లలు చదువుల్లో బాగా వెనకబడి ఉన్నారని, పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేదని వాపోయారు. కోకిల వారికి 9 గురువారముల సాయిబాబా వ్రతమును గూర్చి వివరించింది. ఆత్మవిశ్వాసం మరియు సహనంతో సాయిబాబాను ప్రార్థించినచో వారి పిల్లలు చదువులో ప్రగతి చూపగలరని వారికి సలహా ఇచ్చింది. కోకిల యొక్క బావ, భార్య వారికి వ్రతం యొక్క వివరాలు చెప్పమని కోరగా ...

 

 


తొమ్మిది గురువారములు ఫలములు, పానీయములు తీసుకుని గానీ ఒక పూత ఉపవాసము ఉండిగానీ తొమ్మిది వారములు సాయి మందిరంలో సాయినాథుని దర్శనం చేసుకోవాలి. ఏ భక్తుడైనా స్త్రీ పురుష భేదము లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఈ వ్రతము సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించినచో మహాత్వపూరితమైన ఫలము ప్రాప్తించును. ప్రార్థనలు ఫలించాలంటే ప్రార్థనలు ఫలించాలంటే, కోర్కెలు తీరాలంటే భక్తీపూరితముగా సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి. ఉదయం సమయమైనను, సాయంత్ర సమయమైనను ఈ పూజలు ఆచరించవచ్చును. ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పటమును గాని విగ్రహనును గాని ప్రతిష్టించి సాయినాథుని నుదిటిపై చందనం మరియు తిలకం దిద్దాలి. పూలమాలను గాని పసుపు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభంలో సాయిజ్యోతిని వెలిగించి సాంబ్రాణి, అగరు దూపములను సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలో వున్న చక్కర గాని, మిఠాయిగాని, ఫలములు గాని నైవేద్యముగా సపర్పించాలి. వ్రతములో కూర్చున్నవారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి. పాలుగాని, కాఫీగాని, టీగాని లేక మిఠాయిలనుగాని, ఫలములనుగాని ఆహారముగా సేవించో లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూత (మధ్యాహ్నం/రాత్రి) ఆహారం సేవించిగానీ వ్రతమును ఆచరించాలి. ఆకలి కడుపుతోను లేదా పూర్తీ ఉపవాసంతోనూ ఈ వ్రతమును ఆచరించరాదు. వీలైనచో 9 గురువారములు సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహం లోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి.

 

 

భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయంలో కూడా ఈ వ్రతమును కొనసాగించవచ్చును. ఈ 9 గురువారములు స్త్రీలు మైల పడితే లేక మరో కారణం చేత గాని పూజలను ఆచరించనిచో ఆ గురువారం వదిలివేయవచ్చును. ఈ వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు. మరియు రాబోవు గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారములు పూర్తిచేయాలని వారికి కోకిల సాయివ్రతం గురించి వివరించింది. కొన్ని దినముల తరువాత సూరత్ లో ఉన్న అక్కాబావల నుండి కోకిలకు ఉత్తరం వచ్చింది. వారి పిల్లలు సాయివ్రతం ప్రారంభించారని, ఇప్పుడు పిల్లలు బాగా చదువుకుంటున్నారని, తాము సహితం ఈ తొమ్మిది గురువారముల వ్రతము ఆచరించి సాయివ్రతం పుస్తకములను ఉచితంగా పంచామని వ్రాశారు. స్నేహితురాలు ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఆమె కుమార్తె ఒక చక్కని అబ్బాయితో వివాహం నిశ్చయమైనదని, పక్కింటామె నగల పెట్టి కనపడకపోగా వారు సాయివ్రతం ఆచరించిన 2 నెలలకు పోగొట్టుకున్న నగలపెట్టేను ఎవరో ఆగంతకుడు వారికి తిరిగి పంపాడని ఆ ఉత్తరం ద్వారా తెలియజేసింది. ఇంత అద్భుతమైన అనుభవాలను ఉత్తరం ద్వారా తెలుసుకున్న కోకిల భగవానుని శక్తిని, సాయివ్రత మహిమను తెలుసుకుంది. దీంతో ఆమెకి సాయినాథుని మీదున్న భక్తీ మరీ ప్రగాఢమైంది.

ఉద్యాపన (వ్రతం పూర్తిచేయు) విధానం మరియు నియమాలు

 

 

 

1     తొమ్మిదవ గురువారం 5 మంది బీదలకు అన్నదానం చేయాలి.
2     ఈ వ్రతం యొక్క శక్తిని ప్రజలకు తెలియజేయడానికి ఈ 'సాయిబాబా వ్రతం' పుస్తకములను ఉచితంగా 5, 11, లేక 20 పంచవలెను.
3    తొమ్మిదో గురువారంనాడు ఈ పుస్తకములను పూజ గృహమునందు వుంచి పూజించి ఇతరులకు పంచితే పుస్తకం ప్రసాదముగా అందుకునే వారికి దైవానుగ్రహం లభించును.