Sex Transplantation in Puranas

 

లింగమార్పిడి

పురాణాల్లోనే ఉంది...

Sex Transplantation in Puranas

 

వైద్య శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. మూత్రపిండాలు, గుండె లాంటి కీలకమైన శరీర అవయవాలను మార్పిడి చేయడమే కాదు లింగమార్పిడి ( Sex Transplantation Surgery) కూడా విజయవంతంగా చేస్తున్నారు, చేయించుకుంటున్నారు. విదేశీయులే కాదు, మన దేశస్తులు కూడా కొందరు లింగమార్పిడి చేయించుకుంటున్నారు. ఏ కారణం చేత అయితేనేం లింగమార్పిడి గురించి ఎక్కువగానే వింటున్నాం.

 

ఆధునిక వైద్య విధానంగా చెప్పుకుంటున్న లింగమార్పిడి (Sex Transplantation Surgery) నిజానికి ఈనాటిది కాదు. మన పురాణ ఇతిహాసాల్లో లింగమార్పిడి ప్రసక్తి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి వాటిని గుర్తుచేసుకుందాం.

 

అర్జునుడు బృహన్నల రూపంలో నపుంసకునిగా గడిపినట్లు భారతంలో ఉంది.

 

నారదుడు స్త్రీమూర్తిగా మారి సంతానాన్ని కన్నట్లు పురాణ కథలు ఉన్నాయి.

 

ఒక రాజు తన ఇష్టంకొద్దీ స్త్రీగా మారి, ఇల అని పేరు పెట్టుకున్నట్లు భాగవతంలో ఉంది.

 

హిందూ మతగ్రంధాల్లో ఇలాంటి ఎన్నో అపురూపమైన సంఘటనలు, సన్నివేశాలు కనిపిస్తాయి. కాకపోతే వాటిని మనం అంతగా విశ్వసించం. పుక్కిటి పూరాణాలు అంటూ చప్పరించిపారేస్తాం. కానీ, అలాంటి అంశాలు అన్నీ కూడా విద్య, వైజ్ఞానిక శాస్త్రాలు అభివృద్ధి చెంది ప్రత్యక్షంగా మన కళ్ళముందు అమలవుతుంటే ''ఔరా'' అని ఆశ్చర్యపోతున్నాం. అంతే తప్ప మనవాళ్ళు ఇంత గొప్ప అంశాలను ఎప్పుడో చెప్పారు కదా, అవన్నీ ఏనాడో జరిగినట్లు మన ప్రాచీన గ్రంధాల్లో లిఖితమై ఉన్నాయంటే మనవాళ్ళు అప్పట్లోనే అంత పురోగతి సాధించారు కదా అని ఎంత సంతోషించాలి?!

 

Sex Transplantation Surgery in Hindu Literature, Sex Transplantation Surgery in India, Lingamarpidi, Boys as girls and girls as boys through Sex Transplantation Surgery, Puranas Lingamarpidi