కృష్ణ మురళీ రహస్యం

 

కృష్ణ  మురళీ రహస్యం

సర్వవేళలా కృష్ణుని అంటి పెట్టుకుని ఉండే మురళి అంటే, మాధవుని ఇష్ట సఖులకు ఈర్ష్యగా ఉండేది. కృష్ణుడితో తమకన్నా ఎక్కువ చేరువగా మురళి ఉంటుదని వారి భావన. ఒకసారి ఇదే విషయం మురళిని అడిగిందట రుక్మిణి. గత జన్మలో ఏ పుణ్యకార్యం చేయడం వలన నీకు ఇంతటి సద్భాగ్యం కలిగింది. స్వామి వారి చేతులలో ఎల్లప్పుడూ ఉండే అదృష్టం కలగడానికి నువ్వు నోచిన నోములేమిటో నాకు చెప్పమని రుక్మిణి కోరిందట. అప్పుడు వేణువు, నా లోపల ఏమీ లేదు. నా మనసును దృశ్యరహితంగా చేసుకున్నాను. అలా ఏమి లేకుండా ఉండటం వలనే గోవిందుడికి చేరువయ్యాను అని పలికిందట.  దుష్టబుద్దులు, దురాలోచనలు మానివేసి మనసు నిర్మలంగా వుంచుకుని భగవంతుని ప్రార్థిస్తే ఆయనకు చేరువ కావచ్చు అని తెలస్తుంది.