సుభాషితం - (Subhashitam) పరోపకారం చేస్తున్నాయే గానీ...

 

సుభాషితం - (Subhashitam)

పరోపకారం చేస్తున్నాయే గానీ...

పిబంతి నద్య స్స్వయ మేవనాంభః

ఖాదంతి నస్వాదు ఫలాని వృక్షః

పయోధరా స్సస్యమదంతి నైవ

పరోపకారాయ సతాం విభూతయః

     నదులు తమ నీటిని ఉపయోగించుకోవు. చెట్లు తమ తీయటి పండ్లను తాము తినవు. మేఘాలు వర్షించాం కదాని, కాయగూరలను కోరుకోవు. ఇవన్నీ పరోపకారం చేస్తున్నాయే గానీ ఫలితాన్ని ఆశించడం లేదు. అలాగే, గొప్పవాళ్ళు, ఏమీ ఆశించకుండా ఇతరులకు మేలు చేస్తారు.