సిగ్గును పక్కన పెడితేనే సుఖం (Siggunu..)
సిగ్గును పక్కన పెడితేనే సుఖం
(Siggunu..)
గీతే వాద్యే తథానృత్యే సంగ్రామ రిపు సంకటే
ఆహారే వ్యవహారే చ త్యక్త లజ్జః సుఖీ భవేత్
పాడేటప్పుడు, ఆడేటప్పుడు, వాద్యంలో, యుద్ధంలో, సమస్య ఎదురైనప్పుడు, భోజనం చేసేటప్పుడు, వ్యవహారం చక్కబెట్టేటప్పుడు సిగ్గుపడితే లాభం లేదు. సిగ్గును పక్కన పెడితేనే సుఖం దక్కుతుంది.