Vasishta Maharshi

 

సూర్య వంశ రాజుల కులగురువు వశిష్టుడు

Vasishta Maharshi

 

సప్తఋషులలో ఒకరైన వశిష్టుడు, సూర్య వంశ రాజుల కులగురువు. ఇక్ష్వాకుల వంశరాజులైన దశరథుడు, రాముడు తదితరులకు కులగురువుగా ఉన్న్జ వశిష్టుడు బ్రహ్మ మానవ పుత్రుడు. మరికొన్ని చోట్ల సూర్యుని కుమారుడు అని కూడా ఉంది.

వశిష్టునికి రెండు జన్మలు అనే కథ ఉంది. ఈ కథకు సంబంధించిన వివరాల ప్రకారం నిమి అనే రాజు యజ్ఞం చేయదలచి, వశిష్టుడిని పురోహితునిగా ఉండమని కోరాడు. వశిష్టుడు ఇంద్రుని పురోహితుడిగా ఉండడానికి అప్పటికే అంగీకరించడంతో, ఇంద్రుని వద్ద పని పూర్తయిన తర్వాత నీచేత యజ్ఞం చేయిస్తానని వశిష్టుడు నిమికి వాగ్దానం చేస్తాడు.

వశిష్టుడు వచ్చేవరకూ ఆగకుండా గౌతముడి చేత యజ్ఞం చేయిస్తాడు. ఇంద్రుని వద్ద పౌరోహిత్యం ముగిసిన తర్వాత నిమి వద్దకు వచ్చిన వశిష్టుడు ఆగ్రహించి, నిమికి శాపమిస్తాడు. నిమి కూడా ప్రతి శాపమివ్వడంతో, ఆ శాపాల ప్రభావం వల్ల నిమి, వశిష్టుడు చనిపోతారు.

రెండవ జన్మలో వసిష్టుడు అరుంధతిని వివాహమాడతాడు. సప్త ఋషులలో ఒకడుగా కీర్తి పొందుతాడు.

విశ్వామిత్రుడు తొలుత వశిష్టుడి తపోబలానికి అసూయచెంది, ఆయన కూడా తపస్సు చేసి చివరకు బ్రహ్మర్షి అవుతాడు. ఇంద్రుని సభలోనూ వశిష్టుడికి స్థానం ఉంది.