ఈ రోజే సంకష్టహర చతుర్థి.. సాయంత్రం ఈ పని తప్పక చేస్తే ఆటంకాలన్నీ తొలగిపోతాయి..!

 

ఈ రోజే సంకష్టహర చతుర్థి.. సాయంత్రం ఈ పని తప్పక చేస్తే ఆటంకాలన్నీ తొలగిపోతాయి..!

 


వినాయకుడు హిందూ మతంలో ఏ పూజ జరిగినా, ఏ శుభకార్యం మొదలుపెట్టినా మొదటి పూజ అందుకునేవాడు. వినాయకుడు చవితి రోజు జన్మించాడు.  అందుకే వినాయక చతుర్థి అని కూడా అంటారు.  ఇక వినాయకుడు 32 రూపాలలో ఉంటాడు. ఆ 32 రూపాలలో సంకష్టహర వినాయకుడు కూడా ఒకరు.  సంకష్టహర వినాయకుడిని పూజిస్తే ఎటువంటి కార్యాలు అయినా విఘ్నాలు లేకుండా సవ్యంగా సాగుతాయి అంటారు.  ప్రతి నెల పౌర్ణమి  తర్వాత వచ్చే చవితి రోజున సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు.  చాలా మంది దీన్ని ఒక వ్రతంగా చేసుకుంటారు.  తమ శక్తి మేరకు ప్రతి నెలా వచ్చే  సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడిని ఎంతో భక్తితో పూజిస్తారు.  హోలీ తర్వాత మార్చి 17 వ తేదీన సంకష్టహర చతుర్థి వచ్చింది.  ఈ రోజున వినాయకుడిని ఎలా పూజించాలి.  ఎలా పూజిస్తే మంచిది? తెలుసుకుంటే..

సాధారణంగా సంకష్టహర చతుర్థి రోజు వినాయకుడిని శివుడిని ప్రదోష కాలంలో ఎలాగేతే పూజిస్తారో అదే సమయంలో పూజిస్తారు.  సాయంత్రం 6 గంటల నుండి 7గంటల 30 నిమిషాల లోపు సంకష్టహర గణపతి పూజ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది.

సంకష్టహర వినాయకుడి పూజను ఇలా చేయాలి, అలా చేయాలి అని అనుకోవాల్సిన  అవసరం లేదు.    ఉదయం నిద్రలేచి స్నానం చేసి నిత్య పూజలో గణపతి ముందు స్వామి నా శక్తిమేర నేను నిన్ను పూజిస్తాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. ఆ తరువాత సాయంత్రం ప్రదోష సమయంలో  వినాయకుడిని శక్తి మేరకు షోడశోపచారాలతో పూజించాలి.  వినాయకుడికి గరిక శ్రేష్టం కాబట్టి గరికను తప్పకుండా సమర్పించాలి.  సంకష్టహర చతుర్థి స్తోత్రం,  వినాయక శత నామాలు, వినాయక ద్వాదశ నామాలు.. ఇలా ఎన్ని వీలుంటే అన్ని,  ఏది వీలైతే అది చెప్పుకోవాలి. వినాయకుడిని కుడుములు అంటే ఇష్టం. కాబట్టి బియ్యం రవ్వతో కుడుములు చేసి నైవేద్యం పెట్టాలి. ఈ సంకష్టహర చతుర్థి పూజ సంపూర్ణ సఫలం కావాలన్నా,  దాని ఫలితం సంపూర్ణంగా పొందాలి అన్నా సంకష్టహర చతుర్థి పూజను దగ్గరలో తెలిసిన అర్చకులను పిలిచి పూర్తీగా నియమబద్ధంగా వ్రతంలాగా చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. కుదరకపోతే ఇప్పట్లో ప్రతి వినాయక  గుడిలో సంకష్టహర చతుర్థి రోజు ఎంతో వైభవంగా పూజ చేస్తారు. అక్కడికి వెళ్లి పూజలో పాల్గొనవచ్చు.  పూజా సామాగ్రి  తీసుకెళ్లి స్వామి పూజలో భాగం కావచ్చు.  ఏ విధంగా అయినా సరే..  ప్రతి నెలా ఇలా సంకష్టహర చతుర్థి రోజు పూజ చేసుకుంటూ ఉంటే వినాయకుడి అనుగ్రహం కలిగి అన్ని పనులలో ఆటంకాలు తొలగి విఘ్నాలు లేకుండా సవ్యంగా జరిగిపోతాయి.


                                             *రూపశ్రీ.