Sambarasura

 

ప్రద్యుమ్నుని ప్రత్యర్థి శంబరాసురుడు

Sambarasura

 

శంబరాసురుడు జటాసురుని కుమారుడు. శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుని చేతిలో తన మరణం ఉన్నదని తెలుసుకున్న శంబరాసురుడు ప్రద్యుమ్నుడు పుట్టిన ఎనిమిదవ రోజునే అతనిని అపహరించి నీళ్ళలో పడేస్తాడు. నీళ్ళలో అతడిని ఒక చేప మింగగా, ఆ చేప తిరిగి శంబరాసురుని కుమార్తెకు దొరుకుతుంది. ఆ చేప కడుపులో దొరికిన ప్రద్యుమ్నుని శంబరాసురుని కుమార్తె పెంచి పెద్ద వాడిని చేస్తుండగా, శంబరాసురునికి విషయం తెలిసి, ప్రద్యుమ్నుని హతమార్చడానికి ప్రయత్నిస్తాడు. ఆ యుద్ధంలో ప్రద్యుమ్నుడే శంబరాసురుడిని హతమారుస్తాడు.