రథ సప్తమి (Ratha Sapthami)

 

రథ సప్తమి (Ratha Sapthami)

 

మాఘ శుద్ద సప్తమినే రథ సప్తమి అంటారు. అంటే, సూర్య భగవానుడి పుట్టినరోజన్న మాట.

సూర్యుడు ఏడు ఆశ్వాలతో కూడిన రథం ఎక్కి వస్తాడన్నది మనకు తెలిసిందే. మన్వంతర ప్రారంభంలో మాఘ శుద్ధ సప్తమినాడు, సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట. అందుకే రథ సప్తమిని పవిత్రమైన రోజుగా భావిస్తారు.

కోణార్క్ లోని సూర్య దేవాలయంలో రథ సప్తమిని పురస్కరించుకుని మహా ఉత్సవమే జరుగుతుంది.

రథ సప్తమినాడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రథ సప్తమి రోజున మనం స్నానం చేసే నీటిలో కొన్ని రేగి పండ్లను వేసుకుని చేస్తే మంచిది.

 

స్నానం చేస్తూ, సూర్య భగవానుడికి మనసు అర్పణ చేసుకుంటూ నమస్కరించాలి. ఇలా చేయడంవల్ల శారీరక, మానసిక బాధలన్నీ తొలగిపోతాయి.

ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం మంచిది. ముఖ్యంగా రథ సప్తమినాడు చేస్తే మరీ మంచిది.

ఆవు నేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువులో వదిలితే మంచిది.

సూర్యుని ఎర్రటి పూలతో పూజించడం శ్రేష్టం.

రథ సప్తమి రోజున ఆదిత్య హృదయం పఠిస్తూ భక్తిగా ప్రార్ధించాలి.

రవితేజునికి రేగిపళ్ళు ఇష్టం. కనుక రేగిపళ్ళను, పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి.