ప్రార్ధన.....

 

రేమతో ,భక్తితో పిలిస్తే పలకని ,తలిస్తే తరింపచేయని దైవం ఉంటారా ? భక్తుల ప్రార్ధనలోని వేడుకోలు అనే వెచ్చదనానికి భగవంతుని హృదయం వెన్నలా కరగకుండా ఉంటుందా ? ద్రౌపదిని వస్త్రాభరణం నుంచికాపాడింది ప్రార్ధనే! గజేంద్రుడికి ప్రాణభిక్ష పెట్టింది ప్రార్థనే ! మార్కండేయుడిని యమగండం నుంచి తప్పంచింది ప్రార్థనే ! ప్రహ్లాదుడిని భక్తిముక్తిదాయకుడిని చేసింది ప్రార్దనే! శ్యామను పాముకాటు నుంచి రక్షించి౦ది ,తాత్యాకు ప్రాణభిక్ష పెట్టింది ప్రార్దనే !

ఈ కాలంలో ప్రార్ధనకు అర్ధం మారిపోయింది.దేవుడితో బేరసారాలు ఆడటమే ప్రార్ధనల పరమావధి అయింది .'నా కోరిక తీర్చు...నీ చెంతకోస్తా'.....'ఫలానా పనయ్యేలా చేయ్యి... ''నీకు కనుకలిస్తా ''ఇంకా ఇలాంటివే మన ప్రార్ధనలన్ని ! ఏదిఏమైనా భగవంతుడు అందరివాడు .అందరిలోనూ ఉన్నాడు . ప్రార్ధన స్వభావం ఏదైనా భగవంతుడు వెంటనే కదులుతాడు.అందుకే మనం చేసే ప్రతి ప్రార్ధనకు ప్రతిఫలం ఉంటుంది . కీర్తి ,ప్రతిష్ట ,గౌరవం,ఐశ్వర్య౦,ఆరోగ్యం .....ఏదడిగిన కాదనకుండా భగవంతుడు మనకు కోరినవన్నీ ప్రసాదిస్తాడు .మనం కొరకునేవన్ని కూడా అవే ! మనం చేసే ప్రార్ధనలో 'దేవుడిలా కావాలని ' చేసే ప్రార్ధన ఓకటి ఉండదు .జ్ఞానాన్ని ప్రసాదించమని 'ఒక్కరూ భగవంతుడ్ని వేడుకోరు . ఒకసారి కుంతిదేవితో శ్రీకృష్ణుడు ''అత్తా !ఏదైనా వరం కోరుకో ''అన్నాడట .

''నాపై దయ ఉంటే నాకు ఎడతెగని కష్టాలు ప్రసాదించు ''అందట కుంతిదేవీ . ''అదేమిటి ?అందరు భోగభాగ్యాలు ,సుఖసంతోషాలు కోరుకుంటే నువ్వేమో కోరికష్టాలను ఇవ్వమంటావు?''అని కృష్ణుడు ఆశ్చర్యపోయాడు . ''కష్టాలలో ఉంటేనే కదా నిరతరం భగవంతుడు గుర్తుండేది .సుఖాలకు మరిగితే ఇక నీ అవసరం ఉండదు .నాకు భగవంతుని సాంగత్యమే ఇష్టం .అందుకే నేను భగవంతుడినే ఎల్లప్పుడూ ధ్యానించాల౦టే నాకు కష్టాలనే ఇవ్వు ''. భగవంతుడు చెంతనే ఉంటే మాత్రం కోరి కష్టాలను వరించటం ,మనసును కష్ట పెట్టుకోవటం ఎవరికీ మాత్రం ఇష్టం .మరి ,మన కోరికలను తీర్చుకుంటునే భగవంతుడుని ఎలా ధ్యానించాలి ?నిత్యం భగవంతుడిని మనసు మందిరంలో ఎలా ప్రతిష్టించుకోవాలి ?అసలు మనం భగవంతుడిని కోరుకోవాల్సినవి ఏమిటి ?ఇవన్ని భక్తుడిని సందిగ్ధలో పడవేసే ప్రశ్నలు .చాలా వరకు సులభరీతిలో సమాధానం దొరకనివి కూడా!

ఈ క్రమంలోనే మానవజన్మకు భూమిపైనే చరితార్థం చేయగల సులభోపాయాలు ,సరళబోధలు ,నీతిసూత్రాలు ,చక్కని ఉపదేశాలతో జ్ఞానమార్గాన్ని చూపటానికి ఓ దివ్యవతరం వెలసింది .మానవాళి ఉద్ధరణకు మానవ రూపంలో అవతరించిన ఆ దైవమే షిరిడిసాయినాధుడు .అరవై ఏళ్ళ పాటు ఈ నేలపై నడయాడి మనుషుల పాప కర్మలని ,కష్టాల్ని తనపై వేసుకుని ,తననుభవించి మానవ జీవితాలను పావనం చేసిన సాయినాధుడు భక్తసులభుడు. మనిషి నడవడిక ఎలా ఉండాలో బాబా స్వయంగా ఆచరించి చూపారు.ఆదర్సజీవన విధానానికి బాటలు వేశారు .ఆ అడుగుజాడలే ఇవి....ఆసాయిపధ౦ఇది .......ఆ బాటలో నడవండి !ముక్తులుకండి!జీవితాల్ని ధన్యంచేసుకోండి.ఇక సర్వం శ్రేయస్సులు మీవే!