ప్రదోష వ్రతం ఈ రోజే.. సాయంత్రం ఈ మూడు పరిహారాలు చేస్తే కోరికలన్నీ తీరుతాయి.. !

 

ప్రదోష వ్రతం ఈ రోజే.. సాయంత్రం ఈ మూడు పరిహారాలు చేస్తే కోరికలన్నీ తీరుతాయి.. !

ప్రదోష కాలం, ప్రదోష వ్రతం అనేవి శివుడికి సంబంధించినవి.  ప్రతి నెలలో వచ్చే ప్రతి పక్షంలో త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతం పాటిస్తారు.  మే నెలలో 9వ తేదీన తృతీయ తిథి వచ్చింది.  ఈ రోజున ప్రదోష వ్రతం అయ్యింది.  జీవితంలో సమస్యలు తొలగిపోవాలన్నా, కోరికలు నెరవేరాలన్నా సాయంత్రం ప్రదోష సమయంలో మూడు పరిహారాలు పాటిస్తే మంచిది. అవేంటంటే..

ప్రదోష వ్రతం రోజు పరమేశ్వరుడికి సంబంధించిన పరిహారాలు పాటిస్తే వైవాహిక జీవితంలో మాధుర్యం,  ఆశించిన ఫలితాలు కూడా పొందగలుగుతారు.  

ప్రదోష వ్రతం రోజు శివుడికి  చేసే అభిషేకం విశేష ఫలితాలు ఇస్తుంది.  ఒక రాగి పాత్ర తీసుకుని అందులో గంగాజలం,  పచ్చి పెసలు,  బెల్లం,  తేనె మొదలైనవాటిని వేయాలి.  వీటితో శివలింగానికి అభిషేకం చేయాలి. ఇలా చేస్తే పరమేశ్వరుడు సంతోషపడతాడట.  అంతేకాదు కోరికలను నెరవేరుస్తాడని కూడా నమ్ముతారు.

ప్రదోష వ్రతం రోజు శివలింగానికి బెల్లం సమర్పించాలి.  ఇలా చేయడం వల్ల వ్యక్తి జీవితంలో ప్రేమకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.

ప్రదోష వ్రతం రోజు పార్వతి దేవికి అలంకరణ చేయాలి. అలాగే అలంకరణ సామాగ్రి కూడా సమర్పించాలి.  ఇలా చేయడం వల్ల ఇంట్లో శ్రేయస్సు, ఆనందం వస్తుంది.


                                    *రూపశ్రీ.