గాయత్రి మంత్రం ఎంత శక్తివంతమైనదో.. దీనివల్ల కలిగే మార్పులేంటో తెలుసా!

 


గాయత్రి మంత్రం ఎంత శక్తివంతమైనదో.. దీనివల్ల కలిగే మార్పులేంటో తెలుసా!

మంత్రాలన్నింటిలో గాయత్రి  మంత్రం చాలా శక్తివంతమైనది. ఇది బ్రాహ్మణులు ఉయోగించే మొదటి మంత్రం. సూర్యోదయ, సూర్యాస్తమయ  సమయాల్లో సంధ్యావందనం చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని తప్పక పఠిస్తారు. అయితే గాయత్రి మంత్రాన్ని నిత్యం పఠించడం వల్ల మంత్ర శక్తిని పొందగలుగుతారు. శుచిగా, భక్తిగా గాయత్రి జపం చేయడం వల్ల జీవితంలో ఊహించని సానుకూల మార్పులు ఉంటాయి. అమెరికాకు చెందిన గాయకుడు క్రిస్టోఫర్ టెంపోరెల్లి స్వయంగా గాయత్రి మంత్ర శక్తిని పంచుకున్నారు. తను ప్రతిరోజూ గాయత్రి మంత్రం జపించడం వల్ల  తనకు గొప్ప శక్తి వనరు లభించిందని చెప్పుకొచ్చారు. గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజూ పఠించడం వల్ల జీవితంలో కలిగే సానుకూల మార్పులేంటో తెలుసుకుంటే..

గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మనిషి తన జీవితంలో కోపాన్ని జయిస్తాడు. జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. వ్యక్తి దృష్టి పదునవుతుంది. మనిషి కాంతివంతంగా మారతాడు. రోజూ ఈ మంత్ర జపం చేయడం వల్ల  వ్యక్తిలో ఉత్సాహం, సానుకూల  ఆలోచనలు పెరుగుతాయి. దీనివల్ల జీవితంలో ఎన్నో అడ్డంకులు తొలగుతాయి.

పురాణ గ్రంథాలు, మంత్రాలు పఠించకపోయినా సరే గాయత్రీ మంత్రాన్ని పఠిస్తుంటే మతపరమైన కార్యక్రమాలలో నిమగ్నం అవ్వగలుగుతారు. ఇది అన్ని పాపాలను నాశనం చేస్తుంది. ఈ మంత్ర జపం వ్యక్తిలో ముందుచూపును మెరుగుపరుస్తుంది. ఎవరైనా  ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాద బలం పెరుగుతుంది.

దేని మీదా ఏకాగ్రత లేనివారు, విద్యార్థులు  గాయత్రీ మంత్ర జపం వల్ల చాలా గొప్ప ఏకాగ్రత పొందగలుగుతారు. ఈ మంత్రంలో ఉన్న బీజాక్షరాల కారణంగా మెదడు పదునెక్కుతుంది. నేర్చుకునే సామర్థ్యం, పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. నెగెటివ్ ఎనర్జీ దూరం అవుతుంది.

పేదరికం అంతరించి ధనవంతులు కావాలన్నా, వ్యాపారాలు, ఉద్యోగాలలో విజయం సాధించాలన్నా గాయత్రి జపం  చాలా తోడ్పడుతుంది. వివాహ సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్న వారైతే సోమవారం రోజు పసుపురంగు దుస్తులు ధరించి 108సార్లు గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే సమస్య పరిష్కారమవుతుంది.

వ్యాధులు, దీర్ఘకాలిక జబ్బులతో ఇబ్బంది పడుతున్నవారికి రోగనిరోధక శక్తి  పెంచి జబ్బులు తగ్గడంలో గాయత్రి మంత్రం శక్తివంతంగా పనిచేస్తుంది. ఒక కాంస్య పాత్రలో నీటిని నింపి, దాని ఎదురుగా ఎరుపు రంగు ఆసనం వేసుకుని కూర్చోవాలి. ఆ తరువాత గాయత్రి మంత్రంతో పాటు 'ఐం హ్రీం క్లీం' అని జపించి కాంస్య పాత్రలో ఉన్న నీటిని తాగాలి. ఇలా చేస్తే రోగ   బాధల నుండి   ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యవంతులుగా మారతారు.

                                                          *నిశ్శబ్ద.