Read more!

Poundrakudu

 

భారతంలో మరో వాసుదేవుడు పౌండ్రకుడు

Poundrakudu

 

పౌండ్రక వాసుదేవుడు కరూశ దేశాధిపతి. శ్రీకృష్ణుడికి వాసుదేవుడు అనే మరో పేరు కూడా ఉన్నది. తన పేరు కూడా వాసుదేవుడే కావడంతో ఒకే కాలంలో ఇద్దరు వాసుదేవులు, అందునా తనకు పోటీగా మరో వాసుదేవుడు ఉండడం తగదని భావించాడు వాసుదేవుడు. ఈ కారణంతో శ్రీ కృష్ణునితో విరోధము పెంచుకున్నాడు. ఒక సమయంలో శ్రీ కృష్ణుడు కైలాసానికి వెళ్ళినప్పుడు పౌండ్రక వాసుదేవుడు ద్వారకా నగరము మీద దాడి చేస్తాడు. సాత్యకి పౌండ్రక వాసుదేవుడిని తరిమి వేస్తాడు. మరోసారి శ్రీ కృష్ణునితో ప్రత్యక్ష యుద్ధానికి దిగగా, శ్రీ కృష్ణుడు అతడిని యుద్ధంలో సంహరిస్తాడు.