Kalagnanam- 17

 

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం - 17

Sri Potuluri Veerabrahmendra Swamy Kalagnanam- 17


వీరబ్రహ్మేంద్రస్వామికి మహిమలు ఉన్నాయో లేదో పరీక్షించాలి అని నవాబు అనుకున్నప్పుడు, నవాబును ఉద్దేశించి "ఆ గుఱ్ఱము గర్భములో వున్నశిశివును చూడటమే నీ ఉద్దేశ్యం అని నాకు అర్థమయింది. అది చూసేవరకూ కూడా నాపై నీక్కలిగిన సందేహం తొలిగిపోదు... అవునా!” అని నవ్వుతూ అడిగారు స్వామి.

నవాబు అవునని జవాబిచ్చాడు.

వీరబ్రహ్మంగారు నాలుగువేపులా డేరా కట్టించి, గుఱ్ఱం గర్భంలో వున్నపిల్లను బయటకు తీసి నవాబుకు చూపించారు. నవాబు దాన్ని తన చేతులతో అందుకుని, తెర బయటకు తీసుకువెళ్లి అక్కడున్న ప్రజలందరికీ చూపించారు.అది బ్రహ్మంగారు వర్ణించినట్టే చిత్రమైన గుర్తులు కలిగి వుంది. అందురూ స్వామివారి శక్తిని కళ్ళారా చూసి, ఆశ్చర్యపోయారు.

తిరిగి బ్రహ్మేంద్రస్వామి ఆ గుఱ్ఱపు పిల్లని గుర్రం గర్భంలో ప్రవేశపెట్టి, గుర్రాన్ని తిరిగి బ్రతికించి నవాబుకు ఇచ్చేశారు. ఈ సంఘటనతో నవాబుకు వీరబ్రహ్మంగారిమీద నమ్మకం పెరిగింది. తన భవిష్యత్తు చెప్పమని ప్రార్థించాడు.

 

శ్రీ స్వామి వారు కడప నవాబుకు కాలజ్ఞాన బోధ చేయుట

 

నేను శ్రీ వీర భోజుండనయి ఉద్భవిస్తాను. ఈ కలియుగంలో 5000సంవత్సరములు గడిచేసరికి దుష్టశిక్షణ, శిష్టరక్షణకై వస్తాను.ఈలోపుగా సంభవించే కొన్ని పరిణామములను తెలియపరుస్తున్నాను విను...

ఉప్పుకొండూరులో ఊరి చెరువు కింద ఉత్పాతాలు పుడతాయి. నిజాయితో వ్యాపారం చేసే వర్తకులు క్రమంగా నశించిపోతారు. జలప్రవాహాలు ముంచెత్తటంవల్ల 14 నగరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నేను రావటానికి ఇదే ఒక ప్రబల నిదర్శనం.

నాలుగు వర్ణాలవారు న్యాయం తప్పి నడుస్తారు.

దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుపోయి, మాడిపోతారు.

5972సంవత్సరం ధాత నామ సంవత్సరం మాఘ శుద్ధ బుధవారం రోజున పట్టపగలే పద్దెనిమిది పట్టణాలు దోపిడీకి గురవుతాయి. కోటిదూపాటిలోనూ, కొచ్చెర్ల కోటలోనూ కోడి మాట్లాడుతుంది.

జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ములు దిగమింగి అబద్ధాలాడి బాకీలు ఎగ్గొడతారు. దీనిని నిరూపించుకోవడం కోసం తప్పుడు ప్రమాణాలు చేస్తారు. భర్త మరణించిన స్త్రీలు మరల ముత్తయిదువులవుతారు.

కోమటి కులంలో 25గోత్రముల వారు మాత్రమే నిలిచివుంటారు. ఉత్తర దేశంలో ఉత్తమభేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.

ఇది మహాత్మాగాంధీ గురించి చెప్పిన జ్యోతిష్యం అని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. బ్రహ్మంగారు తాను చెప్పిన జోస్యంలో ఏ విధంగా అయితే 'మహాత్మ' అనే పదం వాడారో గాంధీ కూడా అదే పేరు మీద పేరు పొందటం మనందరికీ తెలిసినదే కదా! దేశ విదేశీయులందరూ కూడా ఆయనను 'మహాత్మ' పేరు మీదే సంభోదిస్తారు.

మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.

పట్టపగలు ఆకాశంలోనుంచి పిడుగుల వాన పడి, నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.

దక్షిణ ప్రాంతంలో అయిదు తలల మేకపోతు పుడుతుంది. పంది కడుపున ఏనుగు పుడుతుంది.

ఇలాంటి వింతలూ ఇప్పటికే అనేకం జరిగాయి. పంది కడుపున ఏనుగు తొండం మాదిరి అవయవం కలిగిన పంది పిల్లలు పుట్టడం, ఇతర అనేక జంతువులు వికృత రూపంతో పుట్టడం ఎన్నోసార్లు వార్తల్లో విన్నాం.

బనగానపల్లెలోని కాలజ్ఞాన పాతర మీది వేపచెట్టుకు జాజిపూలు పూస్తాయి.

గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగానపల్లె నవాబు కొంత కాలమే పాలన చేస్తాడు. ఆ తరువాత బనగానపల్లెను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు.

గోలకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణము ఏలతారు.

మహానంది మరుగున మహిమలు పుడతాయి.

నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించినవారిని నేను కాపాడుతాను. నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు వచ్చి మేమే వీర భోగ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటలను నమ్మరు. మూఢులుమాత్రం నమ్ముతారు.

మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు, అరికాలున తామరపద్మం కలిగిన వారు వస్తారు. వారిని నేనే అని భ్రమ వద్దు. నా రాకకు ఒక గుర్తు ఏమిటంటే కందిమల్లయ్యపల్లిలో నవరత్నమంటపం కడతారు. ఈ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది.

 

Potuluri charitra, history of Potuluri Veerabrahmam, Potuluri kalagnanam, predictions of potuluri