పూజా మందిరంలో విగ్రహాలు ఉండవచ్చా.. పొటోలే పెట్టుకోవాలా..
పూజా మందిరంలో విగ్రహాలు ఉండవచ్చా? పొటోలే పెట్టుకోవాలా?
ఇళ్లలోని పూజా మందిరాల్లో విగ్రహాలు ఉండొచ్చా? ఫొటోలే పెట్టుకోవాలా? ఒకవేళ విగ్రహాలు పెడితే.. వాటి పరిమాణం ఎంతుండాలి? ఈ అనుమానాలు చాలామందిలో ఉంటాయి. నిజానికి పూజా మందిరాల్లో విగ్రహాలు ఉండొచ్చు. అయితే... విగ్రహం అంటూ పూజా మందిరంలో ఉంటే... ఆ మూర్తికి ధూపదీప నైవేద్యం కంపల్సరీ. ఆ విగ్రహ పరిమాణం కూడా ఉంగుష్ట మాత్రం.. అంటే.. బొటనవేలికి సగం మాత్రమే ఉండాలి. పెద్ద విగ్రహమైతే.. ధూపదీప నైవేద్యాలు కూడా అదే స్థాయిలో ఉండాలి.
అలా చేయగలిగినవారే విగ్రహాలను పూజా మందిరాల్లో పెట్టుకోవాలి. చేయలేనివారు ఛాయా చిత్రాలను పూజామందిరంలో పెట్టుకొని పూజించుకోవాలి. అంతేకాని.. విగ్రహాలను పూజా మందిరాల్లో పెట్టి.. ఆ మూర్తిని ఒక రోజు పూజించి.. నైవేద్యాలను అర్పించి... మిగతా రోజుల్లో విస్మరిస్తే... అది అంత మంచిది కాదు. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే... ఇక్కడున్న లింక్ ని ఓ సారి క్లిక్ అనిపించండి.