పితృదోషం ఎన్ని తరాల వరకు ఉంటుందో తెలుసా!
పితృదోషం ఎన్ని తరాల వరకు ఉంటుందో తెలుసా!
పాప పుణ్యాల గురించి, దైవం గురించి తెలిసిన చాలా మందికి పితృ దోషం గురించి తెలియదు. ముఖ్యంగా జ్యోతిష్కులు, అబ్దిక కర్మలు చేయించేవారికి మాత్రమే వీటి గురించి బాగా తెలిసి ఉంటుంది. సాధారణంగా కొందరి జాతకాలలో పితృ దోషం ఉండటం చూస్తుంటాం. ఈ పితృదోషం కారణంగా నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఏదో ఒక సమస్య జీవితంలో ఎదురవుతూనే ఉంటుంది. రోగాలు, ప్రమాదాలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఈ పితృ దోషాన్ని ఒక తరం కాకుండా అనేక తరాలు ఎదుర్కోవలసి ఉంటుందట. ఇంతకీ ఎన్ని తరాలు ఈ దోషం కారణంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది? తెలుసుకుంటే..
పితృ దోషం..
పితృ దోషం అనేది ఒక రకమైన ఋణం అంటున్నారు శాస్త్ర పండితులు. పూర్వీకుల పనిని అంపూర్తీగా చేయడం వల్ల పితృ దోషం వస్తుంది. పూర్వీకుల ఋణంలో తండ్రి ఋణం, తన ఋణం, తల్లి ఋణం, భార్య ఋణం, బంధువు ఋణం, కూతురి ఋణం వంటివి ఉంటాయి. వీటి కారణంగానే పితృదోషం వస్తుంది.
శాస్త్ర ప్రకారం తండ్రి వైపు 7 తరాలు, తల్లివైపు 4 తరాలు పితృ దోషంతో పోరాడవలసి ఉంటుంది. పూర్వీకుల కర్మలకు ఆ తరువాత తరాలలో పిల్లలు , మనుమలు భాగం పొందుతారు. ఇది వారి వారి జీవితాలను నాశనం చేస్తుంది.
పితృదోషం కారణంగా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరగడం, పిల్లలకు పెళ్లిళ్లు కాకపోవడం, ఒక వేళ పెళ్లిళ్లు జరిగినా పిల్లలు కలగక పోవడం వంటి పరిణామాలు ఎదురవుతాయి.
శాస్త్రాల ప్రకారం మద్యం, మాంసం సేవించి పాపాలు చేసే కుటుంబం పట్ల పూర్వీకులు కోపంగా ఉంటారు. దీని వల్ల మొత్తం కుటుంబం బాధలు పడవలసి వస్తుంది.
శాస్త్రాల ప్రకారం సాధారణంగా పూర్వీకుల శ్రాద్దాన్ని మూడు తరాల పాటు నిర్వహిస్తారు. దీనినే పితృత్రయి అంటారు. పితృపక్షాలలో తర్పణం, పిండదానం, శ్రాద్దం, దానధర్మాలు చేయడం, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వంటివి చేయడం ద్వారా పితృ దేవతలను సంతోష పెట్టవచ్చు. అంతేకాదు.. భగవధ్గీతలో 7వ అధ్యాయాన్ని పఠించడం వల్ల కూడా పితృ దేవతలు శాంతిస్తారు.
*రూపశ్రీ.