పత్రీజీ ధ్యాన మహాయాగంలో 8వ రోజు వేద పఠనం
పత్రీజీ ధ్యాన మహాయాగంలో 8వ రోజు వేద పఠనం
కడ్తాల్ లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో పత్రీజీ ధ్యాన మహా యాగం అత్యంత వైభవంగా జరుగుతోంది. యాగంలో 8 వ రోజు డిసెంబర్ 28 న నిర్వహించిన యోగా, వేదపఠనం, సంగీత నాధ ధ్యానం కార్యక్రమాలు ధ్యానులను విశేషంగా అలరించాయి. యోగా నిపుణులు వెంకటేశ్ యోగా ఆసనాలు, ప్రాణాయణం, ముద్రలు గురించి వివరించి ధ్యానులకు యోగా,ధ్యానంపై చక్కటి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే చైతన్య, మాస్టర్ తేజాలు అధ్బుతంగా వేదపఠనం చేసి ధ్యానులకు చక్కటి వేద జ్ఞానాన్ని అందిస్తున్నారు. మరోవైపు సంగీత నాధ ధ్యానం కార్యక్రమం ధ్యానులను విశేషంగా అలరిస్తుంది.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో అధ్బుతంగా జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగం 8 వరోజుకు చేరుకుంది. డిసెంబర్ 28న 8 వరోజు బ్రహ్మర్షి పత్రీజీ అందించిన వీడియా సందేశాలు, అందరికి అధ్బుతమైన జ్ఞానాన్ని అందించాయి. అనంతరం పత్రీజీ కూతురు పరిణత పత్రీ, బ్రహ్మర్షి పత్రీజీ సందేశం గురించి అందరికి అర్థమయ్యే విధంగా వివరించారు. పత్రీజీ మధ్యే మార్గం గురించి తెలియజేసారని తెలిపారు. మనకు శరీరం కూడా ఉంది, ఆత్మ కూడా ఉందని వివరించారని సూచించారని, ఇంట్లోనే గురుకులం ఉండాలని, తల్లిదండ్రులే జ్ఞానవంతులు, సత్యం తెలిసినవారు అయితే ఆ ఇళ్లు గురుకులం తో సమానమని తెలియజేసారని వివరించారు.
కడ్తాల్ లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో పత్రీజీ ధ్యాన మహా యాగం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని తమ సందేశాలు ఇస్తున్నారు. యాగంలో 8వ రోజు డిసెంబర్ 28న సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మణ్ రావు పాల్గొని తన సందేశాన్ని ఇచ్చారు. ఈ భూమి మీద ఇప్పటివరకు ఏ గురువు కూడా తాను గురువును కాదు అని చెప్పలేదని. ఒక బ్రహ్మర్షి పత్రీజీ మాత్రమే చెప్పారని గుర్తుచేసారు. దైవత్వం, మానవత్వం, రాక్షసత్వం మనలో ఉన్నాయని, హింసాను వీడితే మానవత్వం, ప్రేమతత్వం వల్ల దైవత్వం వస్తుందని చెప్పారు. మనకు ఏదీ ఇస్తే అది తిరుగి వస్తుందని అది ప్రకృతి ధర్మమని తెలియజేసారు. అనంతరం పిరమిడ్ స్పిరుచ్యువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ ఇంత అధ్బుతంగా అభివృద్ది చెందడంలో లక్ష్మణరావుది ముఖ్య ప్రాత వుందని కొనియాడారు. అనంతరం లక్ష్మణ్ రావును ఘనంగా సన్మానించారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో నిర్వహిస్తున్న పత్రీజీ ధ్యాన మహా యాగం విజయవంతంగా జరుగుతోంది. యాగంలో 8వరోజు డిసెంబర్ 28న నిర్వహించిన కార్యక్రమంలో PSSM నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు పెంచలయ్య, నెల్లూరు జిల్లా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జే. జే. నారాయణ, అనంతపురం జిల్లా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిశంకర్, PMC managing director ఆనంద్, ప్రకాశం జిల్లా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీల్ పాల్గొని తమ సందేశాలు ఇచ్చారు. తమ జిల్లాలో కొనసాగుతున్న ధ్యాన ప్రచారం గురించి, తాము చేస్తున్న కార్యక్రమాలు, చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే తమ ధ్యాన అనుభవాలను తెలియజేసారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో నిర్వహిస్తున్న పత్రీజీ ధ్యాన మహా యాగం అనేక కార్యక్రమాలతో వైభవోపేతంగా జరుగుతోంది. యాగంలో 8 వరోజు డిసెంబర్ 28న నిర్వహించిన PSSM జిల్లా అధ్యక్షుల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఆసిపాబాద్ జిల్లా, ములుగు జిల్లా, రంగారెడ్డి జిల్లా, సూర్యాపేట జిల్లాల పిరమిడ్ మాస్టర్లు రాజలింగ్, రఘపతి, నర్సింగ్ రాజు, సిద్దపూర్యప్రకాశ్ రావు, వెంకటేశ్వర్లు, పాల్గొని తమ సందేశాలను ఇచ్చారు. తమ జిల్లాలో కొనసాగుతున్న ధ్యాన, జ్ఞాన కార్యక్రమాల గురించి, భవిష్యత్తులో తాము చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి తెలియజేసారు. అనంతరం ఈ జిల్లాల పిరమిడ్ మాస్టర్లను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
అనేక విజ్ఞానదాయక కార్యక్రమాలతో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో నిర్వహిస్తున్న పత్రీజీ ధ్యాన మహా యాగం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్బంగా నిర్వహిస్తున్న ట్రాత్ ఫర్ యూత్ అనే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, మోటివేషనల్ స్పీకర్లు పాల్గొని తమ సందేశాల ద్వారా యువతలో మంచి స్పూర్తిని కలిగిస్తున్నారు. పత్రీజీ ధ్యాన మహా యాగంలో 8వ రోజు డిసెంబర్ 28 న నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. యువకులు మూస పద్దతిలో వెళుతున్నారని అన్నారు. ధ్యానం ద్వారా మనకు దేంట్లో టాలెంట్ ఉందో, ఎందులో ఇష్టం ఉందో తెలుస్తుందని తెలిపారు. అనంతరం సృజన వేణుగోపాల్ రెడ్డి తన ధ్యాన అనుభవాలను వివరించారు. అ తర్వాత మోటివేషనల్ స్పీకర్ వివేక్ చంద్ర, మ్యానిఫెస్టేషన్, ఆలోచనలు, కొత్త సంవత్సరంలో పెట్టుకోవాల్సిన లక్ష్యాల గురించి అధ్బుతంగా వివరించి ధ్యానులు, యువకుల్లో చక్కని స్పూర్తిని నింపారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగం లో సీనియర్ మాస్టర్స్ , గ్లోబల్ మాస్టర్స్ పాల్గొని అధ్బుతమైన సందేశాలను ఇస్తున్నారు. యాగంలో 8వ రోజు డిసెంబర్ 28 న నిర్వహించిన కార్యక్రమంలో PSSA Akademy కి చెందిన శివరామప్ప పాల్గొని ప్రసంగించారు. బ్రహ్మర్షి పత్రీజీ చిన్న చిన్న మాటలతో అధ్బుతమైన సందేశాన్ని అందించారని తెలిపారు. మనమంత దివ్వస్వరూపాలమని, ఆత్మస్వరూపాలమని తెలియజేసారు. ఇప్పుడు మానవులకు కావాల్సింది భౌతిక సంపద కాదని ఆధ్యాత్మిక సంపద కావాలని సూచించారు. విద్యావ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం PSSA Akademy ద్వారా వెలుబడిన ఆధ్మాత్మిక పుస్తకాలను పరిణిత పత్రీ, శివరామప్పలు ఆవిష్కరించారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగం మహోత్సవంలో వివిధ అంశాలపై ప్యానెల్ డిస్కషన్ కార్యక్రమం అధ్బుతంగా కొనసాగుతుంది. పత్రీజీ ధ్యాన మహా యాగం లో 8వరోజు డిసెంబర్ 28న నిర్వహించిన చర్చా కార్యక్రమంలో Power Of Breath - Belief System అనే అంశంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శివప్రసాద్, స్వర్ణలత, కూకట్ పల్లి లక్ష్మీ, నరేంద్ర ఆసోరి, సాయికుమార్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్వాస అంటే ఏమిటీ? పాశ్చాత్య దేశాల్లోని ప్రజలకు శ్వాసపై గల అభిప్రాయాలు ఏమీటీ ? జంతువులు, యోగులు నిమిషానికి ఎన్ని శ్వాసలు తీసుకుంటారు,, అలాగే విశ్వాసం అంటే ఏమీటీ, అనే విషయాల గురించి అధ్బుతంగా చర్చించారు. అనంతరం ధ్యానుల సందేహాలను నివృత్తి చేసారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగం మహోత్సంలో PYMA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరిస్తున్నాయి. యాగంలో 8వ రోజు డిసెంబర్ 28న నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన శైలజ శాకాహారం పాట పాడి ఆకట్టుకున్నారు. అనంతరం కళాకారిణి ఆశా హిందూ, తెలుగు సినీ పాటల పై డ్యాన్స్ చేసి అందరినీ ఉత్సాహపరిచారు. ఆ తర్వాత గురుస్థాన్ వాలంటీర్లు బుద్దుని చరిత్ర పై నృత్య రూపకాన్ని అత్యధ్బుతంగా ప్రదర్శించి అందరినీ అలరించారు. అనంతరం నృత్య కళాకారుణి నీలా భరతనాట్యం నృత్యాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నాగ్ పూర్ కు చెందిన మహేశ్, కలాష్ లు పాప్ సాంగ్ లు అధ్బుతంగా పాడి, ఆడి అందిరినీ ఉత్సాహపరిచారు.
అఖండ ధ్యానం, గురువుల సందేశాలు, యువత లో స్పూర్తిని నింపే కార్యక్రమాలు, ఆటపాటలు, ప్రముఖుల ప్రసంగాలు ఇలా పత్రీజీ ధ్యాన మహా యాగం అంగరంగ వైభవంగా జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న ఈ కార్యక్రమం అందిరీని విశేషంగా అలరిస్తుంది. ఈ సందర్బంగా PSSM ప్రాజెక్టులపై ప్రదర్శిస్తున్న ఏవీలు అందరినీ ఆకట్టుకుంటన్నాయి. యాగంలో 8వరోజు డిసెంబర్ 28న నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ ఓంకారేశ్వర అష్టా దశ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ఏవీని ప్రదర్శించారు. అనంతరం PSSM నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు రవికుమార్, సెక్రటెరీ సుధాకర్, ట్రస్ట్ సభ్యులు పాల్గొని శ్రీ ఓంకారేశ్వర అష్టా దశ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం విశిష్ట…
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగం లో 8వరోజు డిసెంబర్ 28న ప్రదర్శించిన వసుదైక ఫౌండేషన్ ఏవీ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం వసుదైక ఫౌండేషన్ వ్యవస్థాపకులు పేరం నాగేంద్ర, గురుస్థాన్ గురుసేన కార్యకర్తలు వసుదైక ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, అలాగే ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు, భవిష్యత్తుల్లో చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం ప్రదర్శించిన అగస్త్యర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏవీ అందిరినీ ఆకట్టుకుంది. అనంతరం ఈ కార్యక్రమంలో అగస్త్యర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం సెక్రటరీ చంద్రశేఖర్, జాయింట్ మేనేజింగ్ ట్రస్టీ జయకుమార్, ట్రస్ట్ మెంబర్స్ పాల్గొని అగస్త్యర్ పిరమిడ్ ధ్య…