Nikumbhudu

 

నికుంభుడు

Nikumbhudu

 

నికుంభుడు ప్రమధ గణములలో ఒకడు. ఒకరోజు శివుడు నికుంభుని పిలిచి, కాశీ నగరంలో నివాసం ఉండాలనిపిస్తున్నదని, ప్రస్తుతం ఆ నగరంలో ఉన్న దివోదాసును అక్కడి నుంచి తప్పించే మార్గం చూడవలసిందిగా నికుంభుని ఆజ్ఞాపిస్తాడు. శివుని ఆజ్ఞకు బద్ధుడైన నికుంభుడు దివోదాసు వాడకు వెళ్ళి నగరంలో ఈశ్వరునికి ఒక గుడి కట్టించవలసిందిగా సూచిస్తాడు. ఆ విధంగా దివోదాసు కట్టిస్తాడు. అయితే ఎంతకాలమైనా తను కోరిన కోర్కెలు ఈశ్వరుడు తీర్చకపోవడంతో కోపం వచ్చిన దివోదాసు కోపంతో ఆలయాన్ని పగులకోట్టిస్తాడు. ఆలయాన్ని పగుల కొట్టారన్న మిషతో నికుంభుడు, దివోదాసును కాశీ నగరాన్ని వదిలివెళ్ళమని సూచిస్తాడు. ఆ సూచన మేరకు దివోదాసు కాశీనగరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత శివుడు విశ్వేశ్వరునిగా, పార్వతి అన్నపూర్ణగా కాశీ నగరంలో వెలశారు. అప్పటి నుంచే కాశీనగరం పరమపుణ్యక్షేత్రమైంది.