సకల సమస్యలకు పరిష్కారం నవరాత్రి దీక్ష!!
సకల సమస్యలకు పరిష్కారం నవరాత్రి దీక్ష!!
మన సమస్యలను మన బాధలను తొలగించుకునేందుకు సరైన సమయం దేవి నవరాత్రులు
ప్రతి మనిషి ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాడు వారి జీవిత కాలంలో ఎంత ప్రయత్నించినను వాటికి పరిష్కారం లభించదు కొందరికి ఎన్ని పూజలు చేసిన ఫలితం దొరకదు చాలామందికి తరచుగా ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది
ఇటువంటి సమస్యలకు సమాధానం దేవీ నవరాత్రి దీక్ష
నవరాత్రి దీక్ష : అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే అన్న లోకోక్తి అనుసరించి అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదిస్తే దొరకనిది జరగనిది రానిది కానిది అంటూ ఏదీ ఉండదు
అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సరైన సమయం ఈ దేవీ నవరాత్రులు
భక్తిశ్రద్ధలతో నవరాత్రి దీక్షను ప్రతి ఒక్కరు ఆచరించి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
నవరాత్రి దీక్ష విధానం : అవకాశం ఉన్నవారు శరీరం సహకరించేవారు ఉదయాన్నే స్నానం చేసి గురువుల వద్ద నవరాత్రి దీక్షను చేపట్టండి
నవరాత్రి మాలను ధరించండి
నవరాత్రి దీక్ష చేయలేని వారు:
తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం స్నానం ఆచరించి అమ్మవారి పూజలు చేసుకోవాలి దీక్ష కంకణాన్ని చేతికి కట్టుకోవాలి చెప్పులు ధరించకూడదు శుభ్రమైన దుస్తులను మాత్రమే ధరించాలి
సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి
అవకాశం ఉన్నవారు తొమ్మిది రోజులు అఖండ దీపం పెట్టాలి.
లలితా సహస్రనామాలు చదవడం వస్తే ఉదయం సాయంత్రం రెండు పూటలా కానీ వీలు లేని వారు ఒక్క పూట అయినా కానీ పారాయణం చేయాలి.
చదవడం రానివారు కనీసం వినడానికి ప్రయత్నం చేయాలి.
సహస్ర నామాలు చదివేంత సమయం లేని వారు దుర్గ సప్త శ్లోకి ఎక్కువసార్లు వినడానికి ప్రయత్నం చేయాలి
సప్తశ్లోకి చదవడం వచ్చిన వారు ఎక్కువ సార్లు పారాయణం చేయాలి.
శక్తి ఉన్నవారు తొమ్మిది రోజులు రోజుకు ఒక కుటుంబానికి అయినా తోచిన సహాయం దానం చేయాలి
9రోజులు రోజుకు ఒక మంచి పని అయినా చేయాలి.
నవరాత్రి దీక్ష చేసే వారు మెడలో దీక్ష వస్త్రం ధరించాలి
దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం మహిమ : ఈ స్తోత్రం ఎంతో మహిమాన్వితమైనది ఎటువంటి ఆపదలను అయినా తొలగిస్తుంది
ప్రతి ఒక్కరు ప్రతి నిత్యం చెప్పుకోవాల్సిన స్తోత్రం ఇది ఈ నవరాత్రి సమయంలో ఈ స్తోత్రాన్ని ఎంత ఎక్కువగా పారాయణం చేస్తే అంత శుభ ఫలితాలు ఏర్పడతాయి
దీక్ష నియమాలు చేయలేనివారు కనీసం ఈ ఒక్క స్తోత్రం పారాయణం చేసినా సరిపోతుంది
పైన చెప్పినవి ఆచరించడానికి వీలు లేని వారు తొమ్మిది రోజులు చెప్పులు వేసుకోకుండా నిష్గగా ఉండాలి. తోచిన విధంగా అమ్మవారిని పూజించుకోవాలి.
నిజమైన దైవం ఆలయాల్లో విగ్రహాల్లో లేదు
ప్రతి మనిషిలో దైవం ఉన్నాడు మనిషి మనిషికి సహాయం చేసినప్పుడే దైవం కరుణిస్తుంది
కాబట్టి అశాశ్వతమైన డబ్బు కోసం అశాశ్వతమైన ఈ దేహం కోసం ఇతరులను విమర్శించకండి ఇతరులను ఇబ్బంది పెట్టకండి ఇతరులకు హాని చేయకండి సోదర సోదరి భావంతో మెలగండి
శక్తి మేర ఇతరులకు ఏ రూపంలో అయినా సరే సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి.
ఇలా చేస్తే అమ్మవారి కృప కటాక్ష వీక్షణాలు అందరి పైన సదా ఉంటాయి.
తొమ్మిది రోజులు చేయలేని వారు ఆఖరి మూడు రోజులు అమ్మవారిని నిష్ఠతో పూజించి దీక్షగా ఉన్నా కూడా ఫలితం ఉంటుంది!!
◆ వెంకటేష్ పువ్వాడ