కమలాలు ముస్లీమ్‌లవి... పూజలు కృష్ణుడివి

 


కమలాలు ముస్లీమ్‌లవి... పూజలు కృష్ణుడివి

 

 

గురువాయూర్ .... కేరళలో సుప్రసిద్ధ శ్రీకృష్ణ దేవాలయం. అక్కడ శ్రీకృష్ణుడిని తామర పూలతో అలంకరిస్తారు.  అ  దేవాలయమే కాదు చుట్టుపక్కల వున్న సుమారు అన్ని దేవాలయాలలో తామర పూలతో పూజ, అలంకరణ చూస్తాం..... అయితే అందంగా కనిపించే ఆ తామర పూలు.... మత సామరస్యానికి ప్రతీకలు. ఎలా అంటారా...
అదే అక్కడి ప్రత్యేకత... సుప్రసిద్ధ గురువాయూర్ దేవాలయం నుంచి చుట్టుపక్కల వున్న ఇతర ప్రముఖ దేవాలయన్నిటికీ తామరపులని అందించేది ముస్లింలు. అందుకోసం ప్రత్యేకంగా ఊరి మధ్య కొలనులో వీటిని పెంచుతారు.

 

 

కేరళ రాష్ట్రంలోని ‘ఎడక్కుళం’ అనే గ్రామంలో ఎటుచూసినా చెరువులూ, తోటలే కనిపిస్తుంటాయి. ఈ గ్రామంలో సుమారు 60దాకా ముస్లిం కుటుంబాలు వున్నాయి. కొన్ని తరాల నుంచి వీరందరి జీవనోపాధి ఒక్కటే.. తామర పులని దేవాలయాలకి సరఫరాచేయటం. రోజుకి సుమారు పదివేలకు పైగా తామరలని దేవాలయాలకి అందిస్తుంటారు. అదే కాక దుకాణాలకి కూడా వీటిని సరఫరా చేస్తుంటారు. కేరళ మాత్రమే కాదు కర్ణాటకలోని మరికొన్ని దేవాలయాలు కూడా ఈ ఊరి తామరలనే కోరుకుంటున్నాయి. కారణం వాటి నాణ్యత.

 

 

తెల్లవారు జామూనే స్వామి అర్చనకు ముందే తామరపులతో దేవాలయాలలో ప్రత్యక్షమవుతారు వారు. భక్తి శ్రద్ధలతో వాటిని అందిస్తారు. వాటిని అందుకునే పూజారులు కూడా వీరిని ఆప్యాయంగా పలకరిస్తారు. ముస్లింల చేతి మీదుగా పెరిగిన తామరలు... హిందూ దేవతల పాదాల దగ్గర... నిలిచి... మనకి చెప్పేదొక్కటే...

మనిషిని బతికించేది మతం...
దగ్గర చేసేది మతం...
కలుపుకు పోయేది మతం...

-రమ