ఏ రోజున మంచి ముహూర్తమో మనమే చూసుకోవచ్చా? అయితే ఎలా?
ఏ రోజున మంచి ముహూర్తమో మనమే
చూసుకోవచ్చా? అయితే ఎలా?
ఏ మంచి ప్రారంబించడానికి అయిన ఒక మంచి రోజు చూసుకుంటూ ఉంటాము. కాని దానికి మరొకరి మీద ఆధారపడనవసరం లేదు. ఈ క్రింది విధంగా చూసుకుంటే సరిపోతుంది.
ఉదాహరణ: ఆదివారం ప్రారంభించాలంటే ఆ రోజు హస్త, మూల, పుష్యమి, అశ్వని, ఉత్తర, నక్షత్రలయితే మంచిది.
ఆది సోమ మంగళ బుద గురు శుక్ర శని
హస్త
శ్రవణం అశ్వని రోహిణి రేవతి రేవతి శ్రవణం
మూలా రోహిణి ఉత్తరాభాద్ర అనురాధ అనురాధ అనురాధ రోహిణి
ఉత్తర మృగశిర కృత్తిక హస్త అశ్వని అశ్వని స్వాతి
త్రయం పుష్యమి ఆశ్రేశ కృత్తిక పునర్వసు పునర్వసు
పుష్యమి మృగశిర పుష్యమి శ్రవణం
అశ్విని
ఇవికాక తారాబలం, చంద్రబలం కూడా చూసుకుంటే మంచిది. పై చక్రము, తారాబలం, చంద్రబలం కలిపితే శ్రేష్ఠం.
మౌడ్యమిలో చేయకూడని కార్యక్రమములు :
బావి, కొలను, చేరవులు త్రవించటం
యాగాలు, దేవత ప్రతిష్టలు జరిపించటం
వివాహ, ఉపనయనాలు, విద్యాప్రారంభం, నూతన గృహారంభం, కర్ణవేధ పట్టబిషేకములు.
మౌడ్యమిలో చేయవలసిన పనులు:
నక్షత్ర శాంతులు, రోగ సంబంద హోమాలు,
గ్రహశాంత జప దానములు, మాసప్రయుక్తములైన పుంసవనాది కార్యక్రములకు
గురు,శుక్ర మౌడ్యముల దోషము లేదు.