మౌనమే వరం
మౌనమే వరం
స్వాయత్త మేకాంతహితం విధాత్రా - వినిర్మితం ఛాదనమజ్ఞతాయాః ।
విశేషతః సర్వ విదాం సమాజే - విభూషణం మౌనమపండితానామ్ ॥
ఆ విధాత మూర్ఖుల కోసం మౌనం అనే గొప్ప వరాన్ని సృష్టించి వారికి అందించాడు. పండితుల సమక్షంలో మూర్ఖులకు ఆ మౌనమే అలంకారంగా భాసిస్తుంది. తమకు తెలియని విషయాల గురించి మాట్లాడకుండా ఉండేందుకు ఆ మౌనమే రక్షిస్తుంది.