మూసి వాయనాల నోము (Moosi Vayanala Nomu)

 

మూసి వాయనాల నోము

(Moosi Vayanala Nomu)

 

పాట

“మూసి వాయనాల నోము నోచిన ముదితకు

ముద్దుముచ్చట తీరునూ మోక్ష ప్రాప్తి కలుగును"

విధానం

ఈ పాట పాడుకుని, తలపై అక్షతలు వేసుకుని ఉద్యాపన చేసుకోవాలి.

ఉద్యాపనం

పసుపు, కుంకుమ, నల్లపూసలు ,గాజులు, పువ్వులు, పండ్లు, ఆకులు...ఆరు చేటల నిండుగా పోసి, పైన ఒక్కొక్క చేటను బోర్లించి, ఒక్కొక మూసి వాయనాన్నీదక్షిణ తాంబూలాలతో ఆరుగురు ముత్తయిదువులకు యివ్వాలి. ఒకేసారి యిచ్చే శక్తిలేని వారు, వారానికొక వాయనం చొప్పున ఆరు వారాలు యిచ్చుకోవచ్చును. చేటలు పెద్దవయినా, చిన్నవయినా ఎవరి తాహతుకు తగ్గవి వారు ఉపయోగించాలే గాని, చేట యొక్క చిన్నా పెద్దా ఆకారాలకు నియమం లేదు. పెద్ద చేటలతో యిచ్చిన వాయనాలను "పెద్ద మూసివాయనా" లనీ, చిన్న చేటలతో యిచ్చిన వాయనాలను "చిన్న మూసివాయనా" లనీ అంటారు.