సింహాసనం మీద కోతి
సింహాసనం మీద కోతి
పైడి గద్దెమీద పట్టంబు కట్టిన
సిగ్గులేని కోతి మొగ్గలేసె
అల్పమతికి పదవి హస్యాస్పదంబురా
లలితసుగుణజాల! తెలుగుబాల!!
కనకపు సింహాసనమున అంటూ సుమతీ శతకాన్ని గుర్తుచేస్తుందీ పద్యం. బంగారపు గద్దె మీద ఓ కోతిని కూర్చోపెడితే అది తన సహజమైన గుణాన్ని మానుకోదు కదా! పనికిమాలినవారి చేతికి అధికారం వచ్చినా కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాడు శతకకారుడు.
..Nirjara