అంతకు మించి ఉంటుందా!

 

 

 

అంతకు మించి ఉంటుందా!

 

 

లోభశ్చేదగుణేన కిం పిశునతా యద్యస్తి కిం పాతకైః

సత్యం చేత్తపసా చ కిం శుచి మనో యద్యస్తి తీర్థేన కిమ్‌ ।

సౌజన్యం యది కిం బలేన మహిమా యద్యస్తి కిం మండనైః

సద్విద్యా యది కిం ధనైరపయశో యద్యస్తి కిం మృత్యునా ॥

పిసినారితనం (లోభం) కంటే నీచమైన గుణం మరొకటి ఉంటుందా? అపవాదుని వేయడాన్ని మించిన పాపం మరొకటి ఉంటుందా? సత్యానికి కట్టుబడి ఉండటాన్ని మించిన తపస్సు ఉంటుందా? నిష్కల్మషమైన మనసుని మించిన బలం ఉంటుందా? మంచి వ్యక్తిత్వం ఉన్నచోట తీర్థములెందుకు? మంచితనం ఉన్న చోట అలంకారాలు ఎందుకు? సద్విద్యను మించిన ధనం ఉంటుందా? అపకీర్తిని మించిన మృత్యువు ఉంటుందా?

 

 

..Nirjara