శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహ మంత్రాలు!

 

శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహ మంత్రాలు!

 

లక్ష్మీ ఉపాసన అనే గ్రంథంలో ఏయే రాశులలో పుట్టిన జాతకులు లక్ష్మీ కటాక్షం కోసం, ఏ మంత్ర జపం చేయాలన్న విషయం వివరింపబడింది. శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహసిద్ధి కోసం ఆయా రాశులలో పుట్టినవారు చేయాల్సిన మంత్ర జపం నిర్దేశింపబడింది. కొందరికి తమ జన్మరాశి తెలియక పోవచ్చు. వారి సౌకర్యార్థం, వారి  పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి కూడా ఏ విధమైన మంత్రజపం చేసుకోవచ్చునన్న విషయం సూచించబడింది. గురుముఖతః ఉపదేశం పొందిన మంత్రాలు వెంటనే  ఫలితాలను చూపిస్తే, భక్తి శ్రద్ధలతో చేసే మంత్రజపం తప్పక మంచి ఫలితాలనిస్తుంది. మన రాశికి, లేక మన పేరుకు అనువైన మంత్రాన్ని జపిస్తే, తప్పక ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతాం. అందుచేత రాశిని బట్టి ఈ క్రింది మంత్రాలను జపించే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు  చెబుతున్నారు.

రాశి – పేరులో మొదటి అక్షరం – మంత్రం

 

 

మేషం – చూ,చే,చో,లా,లీ,లూ,లె,లో,అ- ఓం ఏం క్లీం సోః

 

వృషభం – ఇ,ఉ,ఎ,ఓ,వా,వి,వూ,వె,వో- ఓం ఏం క్లీం శ్రీః

 

 

మిథునం- కా,కీ,కూ,ఘ,చ,కె,కోహా -ఓం క్లీం ఏం సోః

 

 

కర్కాటకం- హీ,హో,హె,డా,డీ,డూ,డె,డో -ఓం ఏం క్లీం శ్రీః

 

 

సింహం- మా,మీ, మూ,మె,మో,టా,టి,టూ,టె- ఓం హ్రీం ఏం సోః

 

 

కన్య- టో,పా,పీ,పూ,ప,ణ,ఠ,పె,పో- ఓం శ్రీం ఏం సోః

 

 

తుల- రా,రీ,రూ,రె,రో,తా,తీ,తూ,తె- ఓం హ్రీం క్లీం శ్రీం:

 

 

వృశ్చికం-తో,నా,నీ,నూ,నె,నో,యా,యీ,యూ- ఓం ఏం క్లీం సోః

 

 

ధనుస్సు-యె,యో,భా,భీ,భూ,ధా,ఫా,ఢా,భె – ఓం హ్రీం క్లీం సోః

 

 

మకరం- భో,జా,జీ,ఖీ,ఖూ,ఖె,ఖో,గా,గీ- ఓం ఏం క్లీం హ్రీం శ్రీం సోః

 

 

కుంభం-గూ,గె,గో,సా,సీ,సూ,సె,సో,దా- ఓం హ్రీం ఏం క్లీం శ్రీం

 

 

మీనం- దీ,దూ,ధ,ఝ,దె,దో,చా,చీ- ఓం హ్రీం క్లీం సోః

ఈ మంత్రాలు బీజాక్షర సమన్వితాలు. అందుచేత మహాలక్ష్మీదేవి పరిపూర్ణ కటాక్షం కోసం ఈ మంత్రాలను పఠించాలి. ఇంకా మంత్రాలను త్రిసంధ్యలలో పఠిస్తే, ధ్యానమావాహనాది షోడశోపచారపూజలు చేసిన ఫలితం కలుగుతుంది.