మహాత్ములు ఒకరిని మించినవారు ఒకరు
మహాత్ములు ఒకరిని మించినవారు ఒకరు
వహతి భువన శ్రేణిం శేషః ఫణాఫలక స్థితాం
కమఠ పతినా మధ్యే పృష్ఠం సదా స చ ధార్యతే ।
తమపి కురుతే క్రోడాధీనం పయోధి రనాదరాత్
అహహ మహతాం నిఃసీమానశ్చరిత్ర విభూతయః ॥
ఆ ఆదిశేషుడు తన మూపురం మీద పదునాలుగు భువనాలను మోస్తున్నాడు. అంతటి ఆదిశేషుని, ఆదికూర్మము తన తన మూపున భరిస్తోంది. అటు ఆదిశేషునికీ, ఇటు కూర్మానికీ కూడా సముద్రం అండగా నిలుస్తోంది. ప్రళయకాలంలో సముద్రంలో ఉన్న యావత్ ప్రపంచానికీ వరాహమూర్తే రక్షణగా నిలుస్తున్నాడు. మహాత్ములంతా ఒకరికి మించిన వారు ఒకరని కవి ఉద్దేశం.