మంత్ర జపంతో శివుడ్ని ప్రసన్నం చేసుకోండిలా...!
మంత్ర జపంతో శివుడ్ని ప్రసన్నం చేసుకోండిలా...!
శ్రావణ మాసంలో శివారాధన చేస్తే భోలాశంకరుని కరుణా కటాక్షాలు లభించి మనోసిద్ధి ఫలిస్తుందని పండితులు అంటున్నారు. ఇక్కడ ఇచ్చిన కొన్ని మంత్రాలు ప్రతి రోజూ రుద్రాక్షమాలతో జపిస్తే ఫలితముంటుందని వారు తెలిపారు.
జపం చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తర ముఖం వైపు కూర్చొని జపించాలి. జపం చేసేముందు శివుడ్ని బిల్వ పత్రాలతో పూజించాలి.
క్రింద పేర్కొనబడిన మంత్రాలను జపించి భోలాశంకరుని కృపకు పాత్రులవ్వండి...
** ॐ నమః శివాయ
** ప్రౌం హ్రీం ఠః
** ఊర్థ్వ భూ ఫట్
** ఇం క్షం మం ఔం అం
** నమో నీలకంఠాయ
** ॐ పార్వతీపతయే నమః
** ॐ హ్రీం హ్రౌం నమః శివాయ
** ॐ నమో భఘవతే దక్షిణమామూర్తయే మహ్యం మేధా ప్రయచ్ఛ స్వాహా
ఇలా మంత్ర జపం నియమ నిష్టలతో చేస్తుంటే తమరు అనుకున్న అన్ని కోరికలు నెరవేరుతాయని పండితులు సూచిస్తున్నారు.