అలంకార రహితంగా ఉండడంలోని నిగూఢత్వం ...? శివశక్తుల మహిమను ప్రభావితం చేసే నామం...?
అలంకార రహితంగా ఉండడంలోని నిగూఢత్వం?
శివశక్తుల మహిమను ప్రభావితం చేసే నామం...?
అలంకార రహితంగా ఉండడంలోని నిగూఢత్వం
ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. పుష్ప స్వర్ణాభరణాలంకారాలతో పరమేశునికి పని లేదు. ఈ అనంతవిశ్వంలో ఏ అలంకరణలు, ఏ అభరణాలు శాశ్వతం కావు. బాహ్య సౌందర్యం పరమావధి కానేకాదు. జీర్ణించుకు పోయే బాహ్య దేహానికి ముఖ్యత్వం ఇవ్వడం అవివేకం. శాశ్వతంగా ఏ మార్పులేకుండా చిరస్థాయిగా నిలిచివుండేది. ఆత్మ ఒక్కటే. అలాంటి మహోన్నత ఆత్మను మనం సదా గౌరవించి నిర్మలంగా ఉంచుకోవడమే ముక్తిని పొందే మార్గం. ఈ నిగూఢ నిర్మల తత్త్వాన్ని మనకు అవగతం చేసేందుకు అద్యంతరహితుడైన పార్వతీశుడు ఏ అలంకరణలూ లేకుండా అతి నిరాడంబరంగా దిగంబరుడుగా లోకాన నిలిచాడు.
శివశక్తుల మహిమను ప్రభావితం చేసే నామం..
శైవనామాన్ని ధరించేవారు మధ్య రేఖ మద్యలో చందనమూ, కుంకుమ మిశ్రమంలో కూడిన వృత్తాకార రూపాన్ని తప్పక ధరించాలి. వర్థి విభూతి రేఖలవలన శైవ కృపకు మాత్రమే పాత్రులు అవుతారు.అలాకాక మధ్య లో వృత్తాన్ని ధరించడం వల్ల ఆ శివుని పత్నియైన పార్వతీమాత కటాక్షాన్ని కూడా పొందవచ్చు.దేహంలోని మిగిలిన అంగాలపైన మూడు విభూతి రేఖలు మాత్రమే దిద్దుకొవాలి. జప తప ధ్యానాదుల ద్వారా మూలాధార చక్రంలో మేల్కొన్న కుండలిని శక్తి ‘ఇలాపింగళ’ నాడులు (సుషూమ్నా) కలయిక ప్రదేశంలో చేరుకొన్నపడు దానిలోని శక్తిప్రసారం ‘భృకుటి’ (రెండు కనుబొమ్మలు బయటకు రావడానికి ప్రయత్నించే ప్రదేశంలో శివుని త్రిశూలమైన రక్షిణిని తెల్లని వర్ణంలో దిద్దుకుంటారు.
ఈ త్రిశూ లంలోని మధ్యమొనను (గీతను) ఎరుపులో దిద్దుకోవడం వెనుక ఒక రహస్యమున్నది. శక్తిని (ఇది తపము, జపము, ధ్యానముల వల్ల కల్గినది) ఎరుపు వర్ణముతో సూచిస్తారు. కుండలిని శక్తి వర్ణం కూడా ఎరుపే అవ్వడంవలన మధ్య రేఖను తప్పనిసరిగా ఎరుపు రంగులో దిద్దుకుం టారు. నిగూఢంలో పరిశీలిస్తే వైష్ణవనామం, శైవనామం ఈశ్వరుని ఆ యుధాల కలయిక అని సుస్పష్టమౌతుంది. అందువల్లనే ‘శివాయ విష్ణూ రూపాయ! విష్ణూ రూపాయ శివహే’ అన్నారు.