కామధేనువు విగ్రహం లేదా పటం ఇంట్లో ఉందా...ఈ నిజాలు తెలుసా!
కామధేనువు విగ్రహం లేదా పటం ఇంట్లో ఉందా...ఈ నిజాలు తెలుసా!
కామధేనువు.. కోరిన కోర్కెలు తీర్చే గోవు. సాగర మథనంలో కామధేనువు ఉద్భవించింది. ఇది దేవతా గోవు. చాలా మంది తమ ఇళ్లలో కామధేను ఆవు విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఉంచుకుంటారు. దీని వల్ల ఆ ఇంటికి చాలా మంచిదని, కోరిన కోరికలు తీరతాయని అనుకుంటారు. అయితే కామధేనువు విగ్రహాన్ని లేదా పటాన్ని ఇంట్లో ఉంచుకోవాలి అనుకునేవారు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి.
కామధేను విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఇంటి ఈశాన్య మూలలో ఉంచాలి. ఈ దిశను దేవతల దిశగా భావిస్తారు. కామధేను విగ్రహాన్ని ఈ దిశలో పెట్టుకుంటే ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరగుతుందట. దీని కారణంగా ఆనందం, శాంతి వాతావరణం కొనసాగుతుంది. కానీ కామధేను విగ్రహాన్ని పొరపాటున కూడా దక్షిణ దిశలో ఉంచకూడదు. ఇలా చేయడం అస్సలు శుభప్రదంగా పరిగణించబడదు.
వాస్తు ప్రకారం కామధేను విగ్రహాన్ని ఇంటి పూజ గదిలో ఉంచుకోవచ్చు. అలాగే ఈ విగ్రహాన్ని సులభంగా కనిపించే ప్రదేశంలో ఉంచడం వల్ల మంచి ప్రయోజనం ఉంది. అప్పుడే దాని ప్రభావం బాగుంటుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కామధేనువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచవచ్చు. ఆఫీసులలో లేదా వ్యాపార స్థలాలలో కామధేనువు విగ్రహం లేదా చిత్రపటం ఉంచాలి అనుకుంటే ఉత్తరం లేదా తూర్పు దిశంగా పెట్టుకోవడం మంచిది.
కామధేను విగ్రహం..
వాస్తు శాస్త్రం ప్రకారం ఇత్తడి, రాగి, వెండి లేదా బంగారంతో చేసిన కామధేను ఆవు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం పవిత్రం. ఇది కాకుండా ఇంట్లో పాలరాయి లేదా బంకమట్టితో చేసిన విగ్రహాన్ని కూడా ఉంచుకోవచ్చు. విగ్రహానికి ఒక దూడ కూడా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మంచిది. కావాలంటే ఇంట్లో కామధేనువు చిత్రపటాన్ని కూడా ఉంచుకోవచ్చు.
నియమాలు..
ఇంట్లో కామధేను విగ్రహం ఉంటే కొన్ని నియమాలను గుర్తుంచుకోవాలి. విగ్రహం మీద దుమ్ము పేరుకుపోనివ్వకూడదు. అది మురికిగా మారనివ్వకూడదు. వీలును బట్టి ఈ విగ్రహాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయవచ్చు. ఇందుకోసం కామధేను విగ్రహాన్ని గంగాజలంతో కడిగి, పువ్వులు, బియ్యం, ధూపం, అగరువత్తులు మొదలైనవాటితో పూజించాలి. ఈ నియమాలన్నింటినీ పాటించి కామధేనువును పూజిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది.
*రూపశ్రీ