శివ పూజ చేసేటప్పుడు ఈ ఒక్క పని చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది..!

 

శివ పూజ చేసేటప్పుడు ఈ ఒక్క పని చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది..!

 


హిందూ మతంలో దేవతారాధనకు చాలా ప్రాధాన్యత ఉంది.  ప్రతి రోజు ఒక దేవుడిని ప్రత్యేకంగా పూజించడం కూడా హిందూ మతంలో ప్రసిద్ధి చెందిన విషయం. ఇందులో భాగంగా సోమవారం రోజు శివుడిని పూజించడం పరిపాటి.  దేవుడికి ప్రత్యేకమైన ఈ రోజులలో ఆయా దేవుళ్లను పూజించడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయని,  దేవుడి కృపకు పాత్రులు కాగలమని పురాణాలు, పండితులు కూడా చెబుతున్నారు.  అలాంటిదే సోమవారం రోజు పరమేశ్వరుడిని పూజించడం. వారంలో మొదటి రోజు వచ్చే సోమవారాన్ని శివుడికి కేటాయించడం అందరికీ తెలిసిందే..

పురాణాల ప్రకారం పార్వతి దేవీ 16సోమవారాలు ఉపవాసం చెయ్యడం, పరమేశ్వరుడిని పూజించడం ద్వారా ఆ పరమేశ్వరుడిని సంతోషపెట్టిందట. అందుకే సోమవారం రోజు శివుడి పూజ చాలా ప్రత్యేకం అయ్యింది.  అయితే సోమవారం రోజు చేసే శివ పూజలో సాధారణంగా బిల్వ పత్రాల సమర్పణ,  పంచామృత అభిషేకం లేదా రుద్రాభిషేకం వంటివి చేస్తుంటారు.  విభూతి నీటితో కూడా అభిషేకం చేస్తుంటారు.  

ఎవరికైనా కోరుకున్న కోరికలు నెరవేరాలన్నా, జీవితంలో కష్టాలు, ఇబ్బందులు తొలగిపోవాలన్నా, ఆర్థిక సమస్యలు పోవాలన్నా సోమవారం రోజు శివ పూజ సమయంలో శివ చాలీసా చదవాలని  అంటున్నారు. సోషల్ మీడియాలోని వివిధ ఆధ్యాత్మిక వెబ్సైట్ లలో శివ చాలీసా అందుబాటులో ఉంటుంది.  సోమవారం రోజు శివ పూజ చేసి శివ చాలీసాను పఠిస్తే.. జీవితంలో సమస్యలు,  అర్థిక సమస్యలన్నీ గట్టెక్కుతాయని నమ్మకం.  కాబట్టి సోమవారం శివ పూజ సమయంలో అది ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే శివ చాలీసాను భక్తితో పఠించండి.


                                                 *రూపశ్రీ.