సర్వ విద్యలకు, అస్త్రశస్త్రాలకు శివుడు అధిపతా?

 

సర్వ విద్యలకు, అస్త్రశస్త్రాలకు శివుడు అధిపతా?

 

 

అవును అనే మన పురాణాలు తెలుపుతున్నాయి. ఈ విషయం రామాయణంలో కూడా వున్నది. వశిష్ఠ ఆశ్రమంలో ఒకనాడు విశ్వామిత్రుడు (రాజుగా వున్న సమయంలో) తను, తన సేనతో సహా విందు ఆరగించి, ఆ విందు ఏర్పాటుచేసిన "సురభి" అనే మహిమకల ధేనువును బలవంతంగా అయినా తీసుకుపోవలనే కోరికతో బలప్రదర్శన చేసి ఆ సురభి చేతిలో పరాజయం పొందినవాడై ఆశ్రమం నుండి వెళ్ళిపోతాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుని ఎదిరించేందుకుగాను అన్నీ అస్త్రాలు పొందాలి, దీని గురించి ఎవరిని అర్చించాలి అనే సందేహంలో వుండగా ఆయనకు మహాదేవుడు శివుని అర్చించినట్లయితే సర్వ ఆస్త్రాలు లభింపగలవు అనే ఉద్దేశ్యం కలిగి హిమాలయాలకు వెళ్ళి శివుని అర్చించి అన్నీ అస్త్రశస్త్రాలు సంపాదిస్తాడు. దీన్ని బట్టి సర్వ అస్త్రశస్త్రాలకు అధిపతి శివుడే అని తెలింది కదా? యిక విద్యల విషయానికి వస్తే భారతీయ సాంప్రదాయంతో వేదముల నుండి శాస్త్రములు ఉద్భవించాయి. వేదశాస్త్రములే విద్యలు. "వేదశ్శివః శివో వేదేః" అని ప్రమాణమే వున్నది కదా? దీనిని బట్టి సర్వవిద్యలకు శివుడే అధిపతి. విద్యాయోగం కలగాలి అంటే శివారాధన చేయాలి.