శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి..!
శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి..!
శివరాత్రి భారతీయులకు ఎంతో ముఖ్యమైన పర్వదినం. ముఖ్యంగా శివభక్తులకు శివరాత్రి అంటే ఆ దేవాదిదేవుడు నేరుగా ఈ భూమి మీదకు విచ్చేసినంత సంబరం. ప్రతి శివాలయంలో శివలింగానికి అభిషేకాలు జరుగుతాయి. కొన్ని చోట్ల స్వయానా భక్తులే అభిషేకాలు చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని అంటున్నారు పండితులు.
శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మనం ఏ దిశలో ఉన్నామో దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా శివాభిషేకం చేసేటప్పుడు దక్షిణ దిశలో లేదా తూర్పు దిశల నిలబడాలి. ఉత్తరం లేదా పడమర దిశల వైపు చూస్తూ శివాభిషేకం చెయ్యాలి.
శివాభిషేకానికి రాగి పాత్రను సర్వ శ్రేష్టంగా భావిస్తారు. కంచు లేదా వెండి పాత్రలు అయినా ఉపయోగించవచ్చు
చాలామంది శివాభిషేకం అంటే శివలింగం మీద నీరు పోయడమే అనుకుంటారు. కానీ శివలింగం మీద నీరు పోసేటప్పుడు అవి ధారగా పడుతూనే ఉండాలి. నీటిని కొంచెం, కొంచెం పోస్తూ ఆ ధారను విరగగొట్టకూడదు. సన్నటి ధార అయినా సరే శివలింగం మీద ప్రవహిస్తూనే ఉండాలి. అప్పుడే అది శ్రేష్టమైన శివాభిషేకం అవుతుంది.
శివుడికి జలాభిషేకం చేసే నీరు చాలా పవిత్రంగా ఉండాలి. ఈ నీటిలో ఏమీ ఉండకూడదు. కలపకూడదు కూడా.. అలాగే శివలింగానికి జలాభిషేకం చేసేటప్పుడు ధ్యాస అభిషేకం మీదనే ఉండాలి. శివనామం లేదా శివ పంచాక్షరీ మంత్రం స్మరిస్తూ శివుడికి జలాభిషేకం చెయ్యాలి. అలాగే శివాభిషేకం ఎలాంటి తొందర లేకుండా నెమ్మదిగా చెయ్యాలి.
మరొక ముఖ్య విషయం ఏమిటంటే శివలింగానికి అభిషేకం చేసిన తరువాత పొరపాటున కూడా ప్రదక్షిణలు చేయకూడదు. అలాగే శివలింగ అభిషేకం చేసేటప్పుడు శివ లింగానికి తూర్పున తిరిగి తూర్పు దిశకు చూస్తూ అభిషేకం చేయకూడదట.
*రూపశ్రీ.