శివుడి నుండి ఈ విషయాలు నేర్చుకుంటే  విజయం తప్పక సొంతమవుతుంది..!

 


శివుడి నుండి ఈ విషయాలు నేర్చుకుంటే  విజయం తప్పక సొంతమవుతుంది..!

 


శివుడు లయకారుడు.  శివుడిని ప్రదానంగా సోమవారం రోజు పూజిస్తారు.  సాధారణంగా హిందూ దేవుళ్లలో ప్రతి దేవుడు వైభోగాలు అనుభవిస్తారు.  బోలెడు ఉపచారాలు,  నైవేద్యాలు,  అలంకరణలు చేస్తుంటారు. కానీ శివుడికి మాత్రం అవన్నీ ఉండవు. ఆయన నిరాడంబరుడు.  నీటిలో రుద్రాభిషేకం,  బిల్వపత్రాలతో అర్చన, భస్మాభిషేకం.. ఇలా శివుడి ఉపచారాలు చాలా నిరాడంభరమైనవి. శివుడి నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటే జీవితంలో విజయం తప్పక సొంతమవుతుందని అంటారు. అవేంటో తెలుసుకుంటే..

సమానత్వం..

శివుడికి తన భక్తులు అందరూ సమానులే. విలువైన కానుకలు సమర్పించే వారు అయినా, భక్తితో పూజించేవారు అయినా శివుడు సమానంగా చూస్తాడు. అంతేనా.. మనుషులలో మంచివారు, చెడ్డవారు అని ఉంటారు.  చెడ్డవారిలో కూడా శివుడిని ఆరాధించే వారు ఉంటారు. అలాంటి వారిని కూడా శివుడు దయతో కరుణిస్తాడు.  భక్తుడు ఎలాంటి వాడు అయినా తనను భక్తితో ఆరాధించడమే పరమేశ్వరుడికి పరిగణలో ఉంటుంది.  పరమేశ్వరుడిని దేవతలు కూడా పూజిస్తారు. అంతేకాదు రాక్షసులు కూడా పరమేశ్వరుడి భక్తులు ఉంటారు.   పరమేశ్వరుడికి మాత్రం అందరూ సమానులే. ప్రజలందరి పట్ల సమానమైన భావాలు కలిగి ఉండాలని శివుడి నుండి మనం నేర్చుకోవచ్చు.  ఎవరిపైనా వివక్ష చూపకూడదు.

శాంతి..

పరమేశ్వరుడు చాలా శాంతిగా ఉంటాడు. ఆయనకు కోపం రావడం అనేది చాలా అరుదు.అందునా ఆయన చంద్రుడిని తన తలపై ధరించి ఉంటాడు. చంద్రుడు శాంతి కారకుడు.  ఎలాంటి పరిస్థితిలో అయినా ప్రశాంతంగా ఉండాలనే విషయాన్ని పరమేశ్వరుడి నుండి నేర్చుకోవాలి. అంతేనా.. పరమేశ్వరుడు ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు.  ద్యానం అనేది భౌతిక విషయాలకు ఎక్కువగా చలించక పోవడాన్ని సూచిస్తుంది.
సహాయం..

శివుడు భోళా శంకరడు అని పిలవబడతాడు.  ఆర్తితో శివా.. అని పిలిస్తే చాలు.. ఆయన మనసు కరిగిపోతుంది.  ఎప్పుడూ తన భక్తులకు సహాయం చెయ్యడానికి ఆయన సిద్దంగా ఉంటాడు.  ఇలా సహాయం చేసే గుణాన్నిశివుడి నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.

స్త్రీ..

శివుడు చాలా వరకు ఒంటరిగా కనిపించడు.  ఆయన ఎల్లప్పుడూ పార్వతీ సమేతంగా ఉండటానికే ఇష్టపడతాడు. భార్యను, స్త్రీ లను ఎల్లప్పుడూ గౌరవించాలని,  వారిని అవమానించ కూడదని పరమేశ్వరుడి ప్రవర్తన తెలుపుతుంది.


                                                *రూపశ్రీ.