ఈ 5 వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందట..!
ఈ 5 వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందట..!
రోజూ కష్టపడి పనిచేసి డబ్బు బాగా సంపాదించినా ఇంటి ఆర్థిక పరిస్థితి బలపడటం లేదని చాలా మంది అంటూ ఉంటారు. డబ్బు స్థిరంగా ఉంటే ఆర్థికంగా బాగున్నట్టు అర్థం. కానీ చాలా మంది ఇళ్లలో డబ్బు స్థిరంగా ఉండదు. ఎంత సంపాదించినా అలా వచ్చి ఇలా ఏదో ఒక రూపంలో వెళ్లిపోతూ ఉంటుంది. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ జరిగిపోతూ ఉంటాయి. దీనికి కారణం సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని ఇంట్లోకి రానివ్వని కొన్ని వస్తువులు కావచ్చని అంటున్నారు పండితులు. వాస్తు నిపుణులు. ఇంట్లో డబ్బు నిలవకపోయినా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఇంట్లో ఈ కింది 5 వస్తువులు ఉండటం వల్లనే అలా జరుగుతున్నాయని అంటున్నారు.
ఇంట్లో విరిగిన వస్తువులు ఉండటం..
ఇంట్లో ఏవైనా విరిగిన పాత్రలు, అద్దం, గడియారం లేదా ఫర్నిచర్ ఉన్నాయా? ఇవి ఇంటికి చాలా చెడ్డ చెయ్యడమే కాదు.. ప్రతికూల శక్తికి కేంద్రంగా కూడా ఉంటాయట. అలాంటి వాటిని వీలైనంత త్వరగా ఇంట్లోంచి తొలగించాలి. ఇవి అడ్డంకులు, ఒత్తిడి, డబ్బు నష్టానికి కారణమవుతాయి.
ఆగిపోయిన లేదా విరిగిన గడియారం..
ఇంట్లో గడియారం ఆగిపోయినా లేదా తప్పు గా చూపిస్తూ ఉన్నా జీవితంలో పురోగతి కూడా నిలిచిపోతుందని అర్థం చేసుకోవాలట. ఇంట్లో ఎప్పుడూ సరైన సమయాన్ని చూపించే గడియారం ఉండాలి. ఆగిపోయిన గడియారాలు శక్తి స్తబ్దతను సూచిస్తాయి. ఆగిపోయిన గడియారం అంటే మీ సమయం సరిగ్గా గడవడం లేదని కూడా అర్థం. కాబట్టి ఇంట్లో గడియారాల విషయంలో జాగ్రత్త అవసరం.
విచారం లేదా ఒత్తిడిని ప్రతిబింబించే చిత్రాలు..
ఏడుస్తున్న పిల్లల చిత్రం, యుద్ధ దృశ్యం లేదా గోడపై అలసిపోయిన వ్యక్తి చిత్రం.. ఇలాంటివి చాలా మంది షోకేస్ పీస్ లు గా పెట్టుకుంటూ ఉంటారు. కొందరు గోడలకు తగిలిస్తారు. అయితే ఇవి ప్రతికూల శక్తిని అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గోడలపై సానుకూలత, శ్రేయస్సును చూపించే చిత్రాలను ఉంచాలి. లక్ష్మీ దేవి, నవ్వుతున్న పిల్లలు లేదా ప్రకృతి సౌందర్యం లేదా రాధా-కృష్ణుల చిత్రాలు వంటివి పెట్టుకోవడం మంచిది.
ముళ్ళ మొక్కలు..
కాక్టస్ వంటి ముళ్ళ మొక్కలు ఆధునికంగా కనిపించవచ్చు. కానీ అవి ఇంట్లో ఉద్రిక్తత, ఆర్థిక ఇబ్బందులను పెంచుతాయి. ఇంట్లో శుభాన్ని పెంచే మొక్కలను నాటాలి. మనీ ప్లాంట్, వెదురు లేదా తులసి మొదలైనవి మంచిది. ఇవి అందమైనవి మాత్రమే కాదు. శ్రేయస్సుకు చిహ్నం కూడా.
మంచం కింద చెత్త..
మంచం కింద పడి ఉన్న పాత బూట్లు, పనికిరాని వస్తువులు లేదా ఇనుప వస్తువులు శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. మంచం కింద ఖాళీ స్థలం ఉండాలి లేదా అక్కడ శుభ్రమైన, ఉపయోగకరమైన వస్తువులను మాత్రమే ఉంచాలి.
*రూపశ్రీ.