కుమారస్వామిని ఆరాధిస్తే కలిగే లాభాలు
కుమారస్వామిని ఆరాధిస్తే కలిగే లాభాలు...!
సుబ్రహ్మణ్యస్వామి పరమదయాళువు. భక్తుల పాలిటి కొంగు బంగారం. ఆయన్ను పూజిస్తే కలిగే ఫలితాలు అన్నీఇన్నీ కాదు. సుబ్రహ్మణ్యేశ్వరునికి ఎన్నో నామాలు. వాటిలో కుమార ఒకటైతే.. శరవణభవ ఒకటి. అసలు ఆ రెండు పేర్లు ఆయనకు ఎలా వచ్చాయ్? అనంటే.. ఆదిదంపతుల కుమారుడు కానుక కుమారస్వామి అయ్యాడు. ‘శరం’ అంటే రెల్లు గడ్డిలో పుట్టాడు కాబట్టి శరవణ భవుడయ్యాడు. అనే సమాధానం వస్తుంది. అంతేకాదు. ఆయన దేవ సైన్యాధిపతి. పరమేశ్వరునికి సైతం ప్రతి విషయాల్లో విజయాన్ని అందించే దైవం. అందుకే... కష్టాల్లో ఉన్న వారు ఆయన్ను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయ్. సుబ్రహ్మణ్యస్వామిని ‘వేలాయుధన్’ అని కూడా అంటారు. కారణం.. ఆయన చేతిలో శక్తి ఆయుధం ఉండటమే. అది పొదునైన ఆయుధమే కాదు.సునిశితమైన సుక్ష్మబుద్ధికి నిదర్శనం కూడా. అందుకే.. పిల్లలు శరవణభుడ్ని ఆరాధిస్తే.. చదువు బాగా వస్తుందని వేదాలు చెబుతున్నాయ్. ఇంకా ‘ఆరు’ అనే అంకెకు కుమార స్వామికి సంబంధం ఏంటి? కుమార స్వామి సర్పరూపుడై ఉంటాడు.కారణం ఏంటి? ఆయన్ను సర్పరూపుడిగా పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే... ఈ వీడియో క్లిక్ చేయండి.