లక్ష్మీ కటాక్షాన్ని పొందాలంటే ఏం చేయాలి!
లక్ష్మీ కటాక్షాన్ని పొందాలంటే ఏం చేయాలి!
అమృత ప్రాప్తి మంత్రం
చంద్రికే స్వాహా
వటవృక్షం క్రింద కూర్చుని పదివేలసార్లు జపించాలి. దీనిని జపించేందుకు ఉదయాత్పూర్వం ప్రారంభించి సూర్యోదయానికి ముందుగానే ముగించాలి. అదే ప్రాంతంలో నెయ్యితో వెయ్యిసార్లు ఈ మంత్రాన్ని హవనం చేస్తే చంద్రికా యక్షిణీ ప్రసన్నం చెంది అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. కాని ఈ మంత్రం కేవలం అన్నివిధాలా పవిత్రంగా ఉండే మనిషికే వర్తిస్తుంది. అలాంటి వారికే ఫలితం ఉంటుంది.
శంఖినీ యక్షిణీ సాధన మంత్రం
శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా
వటవృక్షం క్రింద కూర్చుని పదివేలసార్లు జపించాలి. దీనిని జపించేందుకు ఉదయాత్పూర్వం ప్రారంభించి సూర్యోదయానికి ముందుగానే ముగించాలి. అదే ప్రాంతంలో నెయ్యితో వెయ్యిసార్లు ఈ మంత్రాన్ని హవనం చేస్తే శంఖినీ యక్షిణీ ప్రసన్నం చెంది మీరు కోరుకున్న పదార్థాలను మీకు అందిస్తుంది.
రుణ విముక్తికి చిన్న ఉపాయం
రుణ సమస్య అనేది చాలా విచిత్రమైన సమస్య. మనిషి ఇందులో కూరుకుపోతే బయటపడటం చాలా కష్టం. ఎవరైతే అప్పుల ఊబిలోనుంచి బయటపడిపోతాడో, అలాంటి వ్యక్తి నిజంగా భాగ్యవంతుడు. దీంతో ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. దీపావళి పండుగ రోజు ఓ చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి.
దీపావళి పండుగరోజు అర్థరాత్రి 12 గంటలకు ఐదు గులాబీ పూలను తీసుకోండి, ఒకటిన్నర మీటరు తెల్లటి వస్త్రాన్ని కొనుక్కొని మీ ముందు పరచుకోండి. ఆ వస్త్రాన్ని నలువైపులా మడుచుకోండి. ఆ తర్వాత ఈ ఐదు గులాబీ పూలను గాయత్రీమంత్రాన్ని పఠిస్తూ ఆ తెల్లటి వస్త్రంలో ఉంచండి. వాటిని భద్రంగా పైన ఉంచండి.
గాయత్రి మంత్రం :
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యమ్
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
ధన-ధాన్యం మరియు ప్రత్యేకమైన లాభాలను పొందేందుకు:
మంత్రం : ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవసాయ, ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధి మేఁ దేహి దాపయ స్వాహా I
ఈ మంత్రాన్ని జపించిన తర్వాత పసుపు రంగులో కలిగిన మిఠాయిలు పిల్లలకు పంచండి. అలాగే గంగాజలాన్ని మీరు పని చేసే చోట చిలకరించండి. ప్రతి రోజు తొమ్మది సార్లు జపిస్తుంటే లక్ష్మీదేవి కృపతో ధనధాన్యాలతో తులతూగుతారు.
ఆకర్షణ వృద్ధి కొరకు
మీరు పూజ చేసే స్థానంలో బంతిపూవును ఉంచండి. ఆ తర్వాత ఆ పూలును పసుపుతో పూజించండి. ఆ పూలును నీటిలో చిదిముకోండి. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దానిని తిలకంగా దిద్దుకోండి. ప్రత్యేకంగా మీ ఎదుటివారు మిమ్మల్ని చూసి ఆకర్షితులవుతారు. ప్రధానంగా అమ్మాయి లేదా అబ్బాయి వివాహ సంబంధాలకు వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రయోగం చేయండి. మంచి ఫలితాలను పొందుతారు.