Read more!

Khammam Balaji Temple

 

ఖమ్మం బాలాజీ టెంపుల్

Khammam Balaji Temple

 

ఖమ్మం జిల్లా అన్నపురెడ్డిలో ఉన్న బాలాజీ టెంపుల్ చాలా ప్రాచీనమైన వైష్ణవ ఆలయం. కోట గోడలా ఉన్నతమైన ప్రాకారం దాటి లోనికి వెళ్తే విశాలమైన ఆవరణ ఆ సువిశాల స్థలం మధ్యలో పశ్చిమాభిముఖంగా బాలాజీ వెంకటేశ్వర ఆలయం ఉంది. గర్భగుడి, అంతరాలయం, మండపం - ఇలా మూడు భాగాలుగా ఉండి, ఎదురుగా ధ్వజస్తంభం ఉన్న ఈ దేవాలయం మహా మహిమాన్వితమైంది.

 

వెంకటేశ్వర ఆలయ మండపంలో ఒకవైపు ఆళ్వారు సన్నిధి, మరోవైపు తాయారు సన్నిధి దర్శనమిస్తుంది. ఆలయానికి ఎదురుగా గరుడాళ్వారు దర్శనమౌతుంది.

 

కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ వెంకటేశ్వర ఆలయం మహా వైభవంగా ఉండేది. ధార్మిక గ్రంధాల్లోనే కాక చారిత్రక గ్రంధాల్లోనూ ఖమ్మం జిల్లా అన్నపురెడ్డి గ్రామంలో ప్రతిష్ఠించిన బాలాజీ వెంకటేశ్వర ఆలయ ప్రస్తావన కనిపిస్తుంది.

 

ఈ వైష్ణవ ఆలయంలో నిత్యం అర్చనలు, ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆయా పర్వదినాల్లో బ్రహ్మోత్సవాలు, ధనుర్మాస పూజలు, లక్ష్మీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు.

 

కొంతకాలం దేదీప్యమానంగా వెలిగిపోయిన ఈ బాలాజీ టెంపుల్ అనంతర కాలంలో ఎందుకో కొంత వైభవం తగ్గింది. తిరిగి ఆంధ్రప్రదేశ్ కు జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఔన్నత్యాన్ని పొందింది.

 

Khammam Balaji Temple, Annapureddi Village and Venkateswara Temple, famous temples in Andhra Pradesh, Lord Venkateswara Temples in India